NTV Telugu Site icon

Israel-Hamas War: డ్రగ్స్ మత్తులో హమాస్ ఉగ్రవాదుల అరాచకం.. ఇజ్రాయిల్‌పై దాడిలో కొత్త విషయాలు..

Hamas.

Hamas.

Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై భీకరదాడులు చేశారు. అత్యంత క్రూరంగా పిల్లలు, మహిళలు అనే కనికరం లేకుండా దారుణంగా మారణహోమానికి పాల్పడ్డారు. చిన్న పిల్లల్ని కనికరం లేకుండా తలలు నరికి హత్యలకు పాల్పడ్డారు. మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టారు. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీలు చనిపోయారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ వైమానికదళం గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. హమాస్ ఉగ్రవాదులు ఉన్న స్థావరాలను నేలమట్టం చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 3000 మంది మరణించారు.

ఇదిలా ఉంటే అక్టోబర్ 7 నాటి హమాస్ దాడిలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి చేసే సమయంలో హమాస్ ఉగ్రవాదులు ‘సైకోయాక్టివ్’ డ్రగ్స్ ప్రభావంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉగ్రవాదులు సింథటిక్ యాఫెటమైన్ స్టిమ్యులేటర్ అయిన కాప్టాగన్ అనే డ్రగ్ ప్రభావంలో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. దీన్ని ‘పేదవాళ్ల కొకైన్’ అని పిలుస్తుంటారు.

Read Also: Scammers: ఏడాదిలో 1.02 ట్రిలియన్ డాలర్లను కొల్లగొట్టిన స్కామర్లు.. ఎక్కువగా ప్రభావితమైన దేశాలు ఇవే..

దాడుల సమయంలో హతమైన హమాస్ ఉగ్రవాదుల జేబుల నుంచి క్యాప్టాగన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు జెరూసలేం పోస్ట్ తెలిపింది. ఈ డ్రగ్‌ని ఉగ్రవాదులు నేరాలకు పాల్పడే సమయంలో తీసుకుంటారని, ఇది వారిని ఎక్కువ సేపు అప్రమత్తంగా ఉంచడంతో పాటు ఆకలి కాకుండా చేస్తుందని పేర్కొంది. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే ముందు భయాన్ని అణిచివేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వీటిని ఉపయోగించారని 2015లో క్యాప్టాగన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఐసిస్ క్షీణించడంతో క్యాప్టాగన్ కు గాజా ప్రాంతంల మార్కెట్ గా మారిందని తెలిపింది.

‘క్యాప్టగాన్’ యాంఫేటమిన్ కుటుంబానికి చెందినది. దీన్ని మానసిక రుగ్మతలు, డిప్రెషన్ కు వాడుతారు. ఇది ఆనందాన్ని పెంచడం, నిద్ర అవసరాన్ని తగ్గించడం, ఆకలిని తట్టుకోవడం, నిరంతర శక్తి కోసం వాడుతారు. ప్రస్తుతం ఈ ఔషధం సిరియాకు ఆదాయ వనరుగా ఉందని జెరూసలేం పోస్టు తెలిపింది.

Show comments