Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Hamas Says It Is Ready To Release All Remaining Hostages For An End To Gaza War

Israel-Hamas: గుడ్‌ఫ్రైడే రోజున హమాస్ కీలక ప్రకటన

Published Date :April 18, 2025 , 11:17 am
By Suresh Maddala
  • గుడ్‌ఫ్రైడే రోజున హమాస్ కీలక ప్రకటన
  • యుద్ధం ఆపితే బందీలను విడుదల చేస్తామని వెల్లడి
Israel-Hamas: గుడ్‌ఫ్రైడే రోజున హమాస్ కీలక ప్రకటన
  • Follow Us :
  • google news
  • dailyhunt

బందీల విడుదల విషయంలో హమాస్ సంచలన ప్రకటన చేసింది. గాజాపై యుద్ధాన్ని ముగిస్తే మిగిలిన ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది. గాజా చీఫ్, చర్చల బృందానికి నాయకత్వం వహిస్తున్న ఖలీల్ అల్-హయ్యా టెలివిజన్‌ ప్రసంగంలో వెల్లడించారు. సమగ్ర ఒప్పందంతో బందీలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఇజ్రాయెల్ చెరలో ఉన్న పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేసేందుకు ఇరు పక్షాలు సమగ్ర ఒప్పందం చేసుకోవాలని హయ్యా సూచించారు. మధ్యంతర ఒప్పందాలను మాత్రం అంగీకరించబోమని.. సమగ్ర ఒప్పందం చేసుకుంటేనే అంగీకరిస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: Banana Price: అరటి ధరలకు రెక్కలు.. ఎన్నడూలేనంతగా అత్యధిక ధర! ఐదు నెలల పాటు నో డోకా

తొలి విడత ఒప్పందంలో భాగంగా ఖైదీ-బందీల విడుదల జరిగింది. ఆ ఒప్పందం ముగియడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇప్పటికే వందలాది మంది పాలస్తీనియన్లు చనిపోయారు. బందీలందరినీ ఒకేసారి విడుదల చేసేంత వరకు దాడులు చేస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ ఘర్షణలను చల్లబరిచేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు కృషి చేశారు. కానీ ఇరు పక్షాలు ఒకరినొకరు నిందించుకోవడంతో పురోగతి కనిపించలేదు. మొత్తానికి గుడ్‌ఫ్రైడే రోజున హమాస్ కీలక ప్రకటన చేసింది. సమగ్ర ఒప్పందంతో బందీలను విడుదల చేస్తామని వెల్లడించింది. దీనికి ఇజ్రాయెల్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

ఇది కూడా చదవండి: Doctor Negligence: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం? పురిటిలోనే మరణించిన బిడ్డ!

తొలి విడత ఒప్పందంలో భాగంగా హమాస్ 38 మంది బందీలను విడుదల చేసింది. మిగిలిన 59 మంది బందీలు విడుదల కోసం చర్చలు జరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక బందీలను విడుదల చేసేంత వరకు దాడులు చేస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ అంటోంది. అయితే యుద్ధాన్ని ముగిస్తేనే బందీలను విడుదల చేస్తామని హమాస్ పట్టుబడుతోంది. ఆయుధాలను విడిచి పెట్టాలన్న డిమాండ్‌ను హమాస్ తిరస్కరిస్తోంది. ఇక గురువారం గాజాపై జరిగిన ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో మహిళలు, పిల్లలు సహా కనీసం 32 మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడిచే పాఠశాలపై జరిగిన దాడుల్లో ఆరుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. హమాస్ కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

ఇది కూడా చదవండి: Reels On Busy Road: నడి రోడ్డుపై కుర్చీలో కూర్చొని టీ తాగుతూ రీల్స్.. తాట తీసిన పోలీసులు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • End Gaza war
  • Hamas
  • IDF
  • Israel
  • Release hostages

తాజావార్తలు

  • Nitish Kumar Reddy: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. తెలుగోడు నితీష్ రెడ్డి భావోద్వేగం!

  • Lalit Modi: లూజర్, జోకర్.. సంజీవ్ గోయెంకాపై మండిపడ్డ ఐపీఎల్ సృష్టికర్త..!

  • NBK113 : పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో నందమూరి బాలకృష్ణ

  • IMD Rain Alert: ఢిల్లీకి తీవ్ర తుఫాన్ హెచ్చరిక.. పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

  • రూల్స్ బ్రేక్ చేసిన Abhishek Sharma.. భారీ జరిమానాతో పాటు ఖాతాలో డీమెరిట్ పాయింట్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions