Site icon NTV Telugu

Tayyip Erdogan: “హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ కాదట”.. టర్కీ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు..

Tayyip Erdogan

Tayyip Erdogan

Tayyip Erdogan: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటే టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. అక్టోబర్ 7న పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి అక్కడి ప్రజల్ని ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది అమయాకు ప్రజలు, పిల్లలు, మహిళలు చనిపోయారు. ఈ దాడి ప్రస్తుతం ఇజ్రాయిల్, హమాస్ మధ్య తీవ్ర యుద్ధానికి కారణంమైమది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతోంది.

ఇదిలా ఉంటే టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ బుధవారం మాట్లాడుతూ.. హమాస్ ఉగ్రవాద సంస్థ కాదని, తమ భూమిని రక్షించుకోవడానికి పోరాటం చేస్తున్న లిబరేషన్ గ్రూప్(విముక్తి కోసం పోరాడుతున్న)గా అభివర్ణించాడు. దేశ పార్లమెంటులో తన పార్టీ చట్టసభ సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, ఎర్డోగాన్ ఇజ్రాయెల్ మరియు హమాస్‌లను తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని కూడా కోరారు. ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొనేందుకు ముస్లిం దేశాలు కలిసికట్టుగా వ్యవహరించాలని ఆయన అన్నారు.

Read Also: Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. ట్రాక్టర్‌తో 8 సార్లు తొక్కించి సోదరుడి హత్య..

గాజాపై ప్రస్తుతం జరుగుతున్న దాడులను ఆపేందుకు ప్రపంచ దేశాలు ఇజ్రాయిల్ పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. టర్కీ మంచి ఉద్దేశంతో ఇజ్రాయిల్ ప్రయోజనం పొందిందని, ముందుగా అనుకున్న దాని ప్రకారం తాను ఇజ్రాయిల్ వెళ్లబోనని ఎర్డోగాన్ అన్నారు. మానవతా సాయం కోసం రఫా క్రాసింగ్ తప్పనిసరిగా తెరిచి ఉంచాలని, ఇరు పక్షాలు కూడా ఖైదీల మార్పిడిని అత్యవసరంగా ముగించాలని ఎర్డోగాన్ తన ప్రసంగంలో పేర్కొన్నాడు.

ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం ఆపడానికి ఐక్యరాజ్యసమితి అసమర్థత పట్ల ఎర్డోగాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ వైపు 1400 మంది చనిపోగా.. 200 మందిని హమాస్ బందీలుగా పట్టుకుంది. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 2360 మంది పిల్లలతో సహా 5791 మంది పాలస్తీయన్లు చనిపోయారు.

Exit mobile version