హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు సాగిస్తోంది. గత సోమవారం నుంచి దాడులను ఉధృతం చేసింది. 400 మందికిపైగా చనిపోయినట్లుగా హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబాష్ హతమయ్యాడు. ఈ మేరకు ఐడీఎఫ్ ఎక్స్‌లో పోస్టు చేసింది.