Site icon NTV Telugu

Israel: హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ మృతదేహం స్వాధీనం చేసుకున్న ఐడీఎఫ్

Israel

Israel

హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ మృతదేహం ఆస్పత్రి సొరంగంలో లభ్యమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది. గత నెలలో మొహమ్మద్ సిన్వర్‌ను చంపేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. తాజాగా గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్‌లోని ఆస్పత్రి కింద ఉన్న సొరంగం నుంచి మొహమ్మద్ సిన్వర్‌ను మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం వెల్లడించారు. మరో సీనియర్ హమాస్ నాయకుడు, రఫా బ్రిగేడ్ కమాండర్ మొహమ్మద్ షబానా కూడా సంఘటనా స్థలంలోనే మృతి చెందారని, ఇంకా అనేక మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఐడీఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. సైనిక ఆపరేషన్ సమయంలో ఈ సొరంగం బయలపడిందని. ఈ స్థలాన్ని హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించిందని ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Avika Gor : నేను దేన్నీ అంత ఈజీగా తీసుకోను..

ఖాన్ యూనిస్‌లోని యూరోపియన్ హాస్పిటల్ కింద బయటపడిన సొరంగాన్ని మీడియాకు ఇజ్రాయెల్ దళాలు చూపించారు. ఇది హమాస్‌కు ప్రధాన కమాండ్ అండ్ కంట్రోల్ కాంపౌండ్ అని డెఫ్రిన్ అన్నారు. పౌరులను హమాస్ మానవ కవచాలుగా ఉపయోగించుకుంటోందని.. పౌర మౌలిక సదుపాయాలు, ఆస్పత్రులను పదే పదే ఉపయోగించుకుంటుందని చెప్పుడానికి ఇదే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆసుపత్రి కింద అత్యవసర గదుల కాంపౌండ్‌లో మొహమ్మద్ సిన్వర్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డెఫ్రిన్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Water Storage at Dams: వరద ప్రవాహం.. నీటితో కళకళాడుతున్న శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలు..!

అయితే సిన్వర్, షబానా మరణ వార్తలను మాత్రం హమాస్ ధృవీకరించలేదు. తాజాగా ఇద్దరి మృతదేహాలను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. అయినా కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. 2023, అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది మొహమ్మద్ సిన్వర్‌‌నే. అతడు సోదరుడు యాహ్యా సిన్వర్‌ గతేడాది ఐడీఎఫ్ చేసిన దాడిలో హతమయ్యాడు.

Exit mobile version