NTV Telugu Site icon

Yahya Sinwar: హమాస్‌ చీఫ్ సిన్వార్‌ పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు

Hamas Chief

Hamas Chief

Yahya Sinwar: హమాస్‌ గ్రూప్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదికలో పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. అతడి తలపై బుల్లెట్ గాయం ఉందని.. దాని కారణంగానే అతడు చనిపోయి ఉంటాడని సమచారం. ఈ మేరకు పోస్టుమార్టం నిర్వహించిన ఇజ్రాయెల్ నేషనల్ ఫోరెన్సిక్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్‌ చెన్‌ కుగేల్‌ తెలిపారు. అతను ఇజ్రాయెల్ డ్రోన్ పైకి కర్రలాంటి దానిని బలంగా విసరడంతో దీనివల్ల అధిక రక్తస్రావం జరిగిందని డాక్టర్ గుర్తించారు.

Read Also: Datta Dalvi: మాజీ మేయర్ పై వీధి వ్యాపారి దాడి

ఇక, హమాస్ నాయకుడు యహ్యా సిన్నార్ విద్యుత్ త్రాడును ఉపయోగించి రక్తస్రావం ఆపడానికి ప్రయత్నించాడు.. అయితే అది ఏ సందర్భంలోనూ పని చేయలేదు అని పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ చెన్ కుగేల్ తెలిపారు. సిన్వార్ మరణించిన 24 నుంచి 36 గంటల తర్వాత శవపరీక్ష నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇది పూర్తైన తర్వాత మృతదేహాన్ని ఇజ్రాయెల్ మిలిటరీకి అప్పగించారు.. వారు హమాస్ చీఫ్ సిన్వార్ మృతదేహాన్ని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించి ఉండవచ్చు అని డాక్టర్ వెల్లడించారు. కాగా, డీఎన్‌ఏ పరీక్ష ద్వారా యహ్యా సిన్వార్‌ ను ఇజ్రాయెల్ గుర్తించింది.