Site icon NTV Telugu

Israel: ఇజ్రాయిల్ పౌరులను బందీలుగా పట్టుకున్న హమాస్ ఉగ్రవాదులు.. వైరలవుతున్న వీడియోలు..

Hamac Attack On Isreal

Hamac Attack On Isreal

Israel: ఇజ్రాయిల్ పాలస్తీనాల మధ్య తీవ్ర యుద్ధం చెలరేగింది. గాజా స్ట్రిప్‌ని పాలిస్తున్న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై మెరుపుదాడి చేశారు. పటిష్ట ఇంటెలిజెన్స్ నిఘా, గూఢచార సంస్థలు ఉన్న ఇజ్రాయిల్ ఈ దాడుల్ని ఊహించలేకపోయింది. ఏకంగా 20 నిమిషాల్లోనే 5000 రాకెట్లను ప్రయోగించింది. ఇప్పటికే ఈ దాడుల వల్ల ఇజ్రాయిల్ లో 40 మంది మరణించారు. 700 మందికి పైగా గాయాలయ్యాయి.

ఇదిలా ఉంటే దాడులతో పాటు ఇజ్రాయిల్ భూభాగాల్లోకి ఎంట్రీ అయిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ సైనికులను, సాధారణ పౌరులను బందీలుగా చేసుకుని, గాజ్రా స్ట్రిప్ లోకి తీసుకెళ్లారు. హమాస్ ఉగ్రవాదులు బందీలను పట్టుకుంటున్న వీడియోను రిలీజ్ చేసింది. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉగ్రవాదులు నడిరోడ్డుపై ప్రజలను కాల్చి చంపేయడం వంటివి ఇందులో ఉన్నాయి.

Read Also: Israel: ఇజ్రాయిల్‌లో 40 మంది.. పాలస్తీనాలో 161 మంది మృతి..

ఉగ్రవాదులు విదేశీయులను కూడా పట్టుకున్నారని తెలుస్తోంది. ఇజ్రాయిల్ లో ఏడుగురు నేపాలీలు గాయపడ్డారని, 17 మందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారని ఇజ్రాయిల్ లోని నేపాల్ రాయబారి తెలిపారు. ఇజ్రాయిల్ పౌరులను బందీలుగా పట్టుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పటి వరకు వ్యాఖ్యానించలేదు.
https://twitter.com/Iyervval/status/1710595368722055520

హమాస్ అధికార ప్రతినిధి ఖలీద్ ఖడోమీ ఆల్ జజీరా ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో హమాస్ చర్యల్ని సమర్థించాడు. అనేక ఏళ్లుగా పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న దురాగతాలకు, గాజా, అల్-అక్సా వంటి పాలస్తీనా పవిత్ర స్థలాలకు వ్యతిరేకంగా జరిగిన దురాగతలకు ప్రతిస్పందనగా పేర్కొన్నాడు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోని ఇజ్రాయిల్ ని నిలువరించాలని కోరాడు.

ఇదిలా ఉంటే బందీలుగా పట్టుకున్న వారిని విడుదల చేయాలని ఈయూ విదేశాంగ పాలసీ చీఫ్ జోసెప్ బోరెల్ పిలుపునిచ్చారు. మరోవైపు దీన్ని యుద్ధంగా ప్రకటించింది ఇజ్రాయిల్. గాజాను చుట్టుముట్టిని ఇజ్రాయిల్ సైన్యం, వైమానికి దాడులు చేస్తోంది. ముఖ్యంగా హమాస్ స్థావరాలపై బాంబులు కురిపిస్తోంది.

Exit mobile version