Site icon NTV Telugu

Saudi Arabia: మక్కా, మదీనాను ముంచెత్తిన వర్షాలు.. సౌదీ వీడియోలు వైరల్..

Saudi Arabia Rain

Saudi Arabia Rain

Saudi Arabia: ఎడారితో నిండి ఉండే సౌదీ అరేబియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పవిత్ర నగరాలైన మక్కా, మదీనా, జెడ్డా నగరాలు జలాశయాలను తలపిస్తున్నాయి. రోడ్లన్ని నీటిలో నిండిపోయాయి. మక్కా నగరంలోని పలు అపార్ట్‌మెంట్లలోకి నీరు చేరింది. వర్షాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లగ్జరీ కార్లు వరద నీటిలో మునిపోయాయి.

Read Also: Naga Vamsi: ఊర్వశిని కొట్టింది నేనా.. బాలయ్యే కొట్టాడు.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్

సౌదీ అరేబియా వాతావరణ శాఖ మక్కా, మదీనా, జెడ్డాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. జనవరి 10 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. జెడ్డా విమానాశ్రయంలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సౌదీలో 2009 లో విపత్తు సంభవించి 100 మందికి పైగా మరణించారు. ఏప్రిల్ 2024లో గల్ఫ్ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో వర్షపాత నమోదైంది. తాజాగా మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Exit mobile version