NTV Telugu Site icon

Guinness World Records : ఒంటిపై మంటలతో పరుగెత్తిన రియల్ హీరో.. హ్యాట్సాప్ బాసూ..

Gunniess Records

Gunniess Records

ఒంటిపై మంటలు వ్యాపిస్తున్నా కూడా ఏ మాత్రం భయపడకుండా ఓ వ్యక్తి వంద మీటర్లు పరుగు తీసాడు.. అతనికి ఏమో కానీ చూసేవారికి వణుకు పుట్టింది.. ఆ ధైర్య సాహసాలకు మెచ్చిన గిన్నిస్ బుక్ అధికారులు అతనికి గిన్నిస్ లో చోటు ఇచ్చారు.. అతను చేసిన పనికి కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే మరి కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నా.. మరి కొందరు అతని ధైర్యానికి అభినందనలు తెలుపుతున్నారు.. ఆ వ్యక్తికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..

విషయానికొస్తే.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం జోనాథన్ వెరో ఒక ప్రొఫెషనల్ స్టంట్ మ్యాన్. చిన్నప్పటి నుంచి మంటలు అంటే ఇష్టమట. అగ్నితో ఆటలు ఆడాడట. ఫైర్ ఫైటర్‌గా ఫైర్ షోలలో మంటలను ఆర్పడం, మంటలను మింగడం వంటివి చేస్తూ ప్రేక్షకుల్ని అలరించేవాడట. ఇవన్నీ అతను ప్రపంచ రికార్డు బద్దలు కొట్టడానికి సహకరించాయి..ఆక్సిజన్ లేకుండా ఒంటిపై మంటలు మండుతుంటే అత్యంత వేగంగా 100 మీటర్లు 17 సెకండ్లలో పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు జోనాథన్ వెరో. ఈ రికార్డ్‌కి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది..

ఈ వీడియోను చూసిన నెటిజన్లుభిన్నంగా స్పందించారు. ‘అలాంటి మూర్ఖపు రికార్డులు ఎందుకు ఉన్నాయి’ అని ఒకరు.. ‘ఇది రికార్డు ఎలా అవుతుంది?’ అని మరొకరు వరుసగా కామెంట్లు చేశారు. ఇలాంటి ప్రాణాలకు ప్రమాదకరమైన ఫీట్లు రికార్డులలోకి ఎలా తీసుకుంటున్నారని చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఏది ఏమైన అతని ధైర్యానికి మెచ్చుకొని చాలా మంది అతన్ని రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో లైకులు, కామెంట్లతో దూసుపోతుంది.. ఒకసారి ఆ ఒళ్ళు గగూర్పొడిచే వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి.. నిజంగా ఇటువంటి సాహసాలు చెయ్యాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే.. మీ డేర్ కు హ్యాట్సాప్..

Show comments