NTV Telugu Site icon

Guinness World Record: గిన్నీస్ రికార్డుల్లోకి ‘శునకం’.. ఎందుకో తెలుసా..?

Oldest Dog

Oldest Dog

ఓ శునకం ఏకంగా గిన్నీస్‌ రికార్డు ఎక్కింది.. శునకం ఏంటి? రికార్డుల్లోకి ఎక్కడం ఏంటి? ఇంతకీ ఏం చేసింది? అనే అనుమానాలు వెంటనే రావొచ్చు.. అయితే, ఆది జీవించిన కాలమే.. ఆ శునకాన్ని రికార్డుల్లోకి ఎక్కేలా చేసింది.. అమెరికాకు చెందిన గిసెల్లా షోర్‌ అనే మహిళ.. టోబీకీత్‌ అనే కుక్కను పెంచుకుంటున్నారు. ఇది అనాయింట్స్‌ చినుహుహా జాతికి చెందినది.. దీనిని ‘ప్రపంచంలో అత్యంత పురాతనమైన కుక్క’ బిరుదుతో అభిషేకించింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్… దీని వయస్సు 21 ఏళ్ల 66 రోజులు కావడం విశేషం.

Read Also: Long Covid: కరోనా బాధితుల్లో తీవ్ర సమస్యలు..!

గిన్నీస్‌ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్‌ చేసిన పోస్టు అందరి దృష్టిని ఆకర్షించింది.. ఇక, నెటిజన్లు లైక్‌లు, షేర్లతో దానిని వైరల్‌ చేవారు.. “జీవించి ఉన్న అతి పురాతన కుక్క – 21 సంవత్సరాల 66 రోజుల వయస్సులో టోబీకీత్” అంటూ కామెంట్‌ పెట్టింది ఆ సంస్థ.. ఆ శునకం యజమానిపై కూడా ప్రశంసలు కురిపించింది.. “స్వీట్‌, సున్నితమైన, ప్రేమగల అంగరక్షకుడిగా వర్ణించారు… ఆమె తన కుక్కలకు ప్రోటీన్లు, కూరగాయలు మరియు బియ్యంతో కూడిన సమతుల్య ఆహారాన్ని ఎల్లప్పుడూ అందించారు.. కానీ, ఆమె ఆ శునకాన్ని మొదటిసారిగా దత్తత తీసుకున్నప్పుడు ప్రపంచంలోనే జీవించి ఉన్న కుక్కల్లో అత్యంత వయస్సు కలిగిందిగా రికార్డు సృష్టిస్తుందని ఎప్పుడూ అనుకోలేదని.. గిన్నీస్‌ వరల్డ్ రికార్డ్స్ తన బ్లాగ్‌లో షేర్‌ చేసింది.. ఇక, ఈ రికార్డుపై స్పందించిన గెసెల్లా.. ఇంత కాలం నాతో ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితాన్ని గడిపిందని తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు.. మేం దానిని ఎంతగానో ఆరాధిస్తాము మరియు ఈ రికార్డును సాధించడం మేం టోబీకీత్‌కి అందించిన ప్రేమకు నిదర్శనం.. నా జీవితంలో ఇప్పటికీ ఉండటం నా అదృష్టంగా పేర్కొన్నారు..