NTV Telugu Site icon

Gotabaya Rajapaksa: సూట్‌కేస్‌లతో పారిపోతున్న శ్రీలంక అధ్యక్షుడి వీడియో వైరల్

Srilanka Economic Crisis

Srilanka Economic Crisis

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు పూర్తిగా దిగజారాయి. శుక్రవారం దేశంలో పెద్ద ఎత్తున్న నిరసన, ఆందోళనలు జరిగాయి. ఆందోళనకారులు ఏకంగా ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని, సెక్రటేరియట్ ను ముట్టడించారు. పోలీస్ బందోబస్తు ఉన్నా కూడా ఆందోళకారుల్ని అదుపులో చేయలేకపోయారు. దీంతో నిరసనకారులు ప్రెసిడెంట్ భవనంలోకి ప్రవేశించారు. నిరసనకారులతో మాజీ ఆర్మీ అధికారులు, ప్రముఖ క్రికెటర్లు సనత్ జయసూర్య, కుమార సంగక్కర ఆందోళనలకు మద్దతు పలికారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స్ పారిపోతున్న వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. అయితే భారీ ఆందోళనలు చెలరేగుతాయనే సమాచారంతో అధ్యక్షుడు, ప్రెసిడెంట్ భవనాన్ని వదిలి సురక్షిత ప్రాంతానికి పారిపోయాడు. శ్రీలంక నేవీ షిప్ లో సూట్‌కేస్‌లతో పారిపోతున్నట్లు ఈ వీడియోలో ఉంది. శ్రీలంక నేవీ షిప్ లో సూట్‌కేస్‌లు లోడ్ చేస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇవన్నీ అధ్యక్షుడు రాజపక్సేవే అని స్థానిక మీడియా పేర్కొంది. విజువల్స్ లో ముగ్గురు వ్యక్తులు పెద్ద సూట్‌కేస్‌లను శ్రీలంక నేవీ షిప్ గజబాహు ఓడలో తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ముగ్గురు వ్యక్తులు సూట్‌కేస్‌లను పట్టుకుని హడావుడిగా పరిగెత్తడం ఇందులో కనిపిస్తోంది.

Read Also: Chiru – Nag: దసరా బరిలో ఆ ఇద్దరు సీనియర్ స్టార్స్!

కొలంబో పోర్టులో నుంచి శ్రీలంక నేవీ షిప్ లు సిందూరాల, గజబాహు బయలుదేరాయని అక్కడి హర్బర్ మాస్టర్ వెల్లడించారు. అయితే నౌకల్లో ఎక్కినవారి వివరాలు పూర్తిగా అందలేదు. అయితే అధ్యక్షుడు శ్రీలంకను వదిలిపెట్టాడా..? అనే దానిపై స్పష్టత లేదు. అయితే శ్రీలంకన్ ఆర్మీ అధ్యక్షుడిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత శ్రీలంకలో అడుగుపెడుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

 

Show comments