సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంగారం కోసం వెళ్లిన జనం ఒక్కసారి బంగారం గని కూలిపోవడంతో 38 మంది మృతి చెందినట్లు సూడాన్ ప్రభుత్వ మైనింగ్ కంపెనీ వెల్లడించింది. సూడాన్ రాజధాని ఖార్టోమ్‌కు 700 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గత కొంత కాలం క్రితమే సూడాన్ ప్రభుత్వం ఈ బంగారం గనిని మూసివేసింది. బంగారం కోసం స్థానిక ప్రజలు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
సూడాన్‌లో ఇప్పటికే పలుమార్లు బంగారు గనులు కూలిపోవడంతో చాలా మంది మృతి చెందారు. అయిఏ అక్కడి ప్రభుత్వం బంగారు గనులపై ప్రత్యేక దృష్టి సారించి గనులు కూలకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు పలు మార్లు విన్నపాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు.
