NTV Telugu Site icon

Abdul Rehman Makki: కాశ్మీర్ పాకిస్తాన్ జాతీయ సమస్య.. గ్లోబల్ ఉగ్రవాది మక్కీ..

Abdul Rehman Makki

Abdul Rehman Makki

Global terrorist Abdul Makki calls Kashmir ‘Pakistan’s national issue’: పాకిస్తాన్ దేశానికి చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ కాశ్మీర్ గురించి వ్యాఖ్యలు చేశాడు. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ కాశ్మీర్ ని పాకిస్తాన్ జాతీయ సమస్యగా పేర్కొన్నాడు. ఇటీవల చైనా పట్టువీడటంతో ఐక్యరాజ్యసమితి అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. లష్కరేతోయిబా (ఎల్‌ఇటి) డిప్యూటీ లీడర్ గురువారం లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలు నుండి ఒక వీడియోను విడుదల చేశాడు. తనకు అల్ ఖైదా, ఇస్లామిస్టేట్ ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని అన్నాడు.

Read Also: Ind vs NZ: భారత బౌలర్ల విజృంభణ, కష్టాల్లో కివీస్.. 15 పరుగులకే 5 వికెట్లు

కశ్మీర్ ప్రజలపై జరుగుతున్న అకృత్యాలు అంతం కావాలంటే ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం సమస్యను పరిష్కరించాలని కూడా మక్కీ కోరాడు. కాశ్మీర్ కు సంబంధించి ఇది మాకు ప్రధాన అంశం అని.. మేము దీన్ని పాకిస్తాన్ జాతీయ సమస్యగా పరిగణిస్తామని.. కాశ్మీర్ ప్రజలపై అకృత్యాలు అంతం కావాలంటే యూఎన్ఓ తీర్మాణం ప్రకారం పరిష్కరించుకోవాలని ఆయన సూచించాడు. ఐసిస్, అల్ ఖైదా అభిప్రాయాలకు తాము వ్యతిరేకం అని అన్నాడు. ఒసామా బిన్ లాడెన్, ఐమాన్ అల్-జవహిరి వంటి వ్యక్తుల అభిప్రాయాలను, ఆలోచనలను, చర్యలను ఆమోదించనని మక్కీ స్పష్టం చేశాడు. 1980లలో ఇస్లామిక్ యూనివర్శిటీ ఇస్లామాబాద్‌లో ఫ్యాకల్టీ మెంబర్‌గా ఉన్న సమయంలో మక్కీ అల్-ఖైదా నాయకులను, ఆఫ్ఘన్ కమాండర్లను కలిసినట్లు అభియోగాలు ఉన్నాయి. దీన్ని మక్కీ ఖండించాడు.

ముంబై దాడులు ప్రధాన సూత్రధారి జమాత్ ఉద్ దావా చీఫ్ హఫీస్ సయీద్ కు మక్కీ స్వయానా బావమరింది. అయితే విడుదల చేసిన వీడియలో 26/11 ముంబై దాడుల గురించి ప్రస్తావించలేదు. యూఎన్ భద్రతామండలి ఆంక్షల కమిటీ భారత్, అమెరికా దేశాల ఒత్తడితో మక్కీని సోమవారం అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అయితే దీనిపై మక్కీ స్పందిస్తూ.. భారత ప్రభుత్వం తప్పుడు సమాచారంలో నన్ను ఉగ్రవాదిగా లిస్ట్ చేసినట్లు తెలిపారు. నాపై విచారణ లేకుండా ఇలా చేయడం నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించనట్లే అని మక్కీ అన్నాడు.