NTV Telugu Site icon

Nigeria: మాజీ ప్రియుడి హత్యకు ప్రియురాలి కుట్ర.. విషపూరితమైన సూప్ తాగి ఐదుగురు మృతి

Nigeria

Nigeria

జీవితంలో చాలా మంది యవసులో ఉన్నప్పుడు ప్రేమించుకుంటారు. కలిసి తిరుగుతుంటారు. విడిపోతుంటారు. ఇలా కామన్‌గా జరిగిపోతూ ఉంటాయి. కొందరు వివాహ బంధంలోకి అడుగుపెడతారు. మరికొందరు మనస్పర్థలు వచ్చి మధ్యలోనే విడిపోతుంటారు. ఎవరిదారి వారు చూసుకుంటారు. కొందరైతే పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. కసి తీర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తుంటారు. ఇలానే ఓ ప్రియురాలి.. మాజీ ప్రియుడి హత్యకు కుట్ర చేసింది. ఇంకేముంది.. సూప్‌లో విషం కలిపి ఇచ్చింది. ఇదేమీ తెలియని ఆ వ్యక్తి.. తన నలుగురి స్నేహితులతో షేర్ చేసుకున్నాడు. అది తిన్నకాసేపటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రియురాలి.. మాజీ ప్రియుడికి స్పాట్ పెడితే.. అతడితో పాటు అన్యంపుణ్యం ఎరుగని మరో నలుగురి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. ఈ దారుణ ఘటన నైజీరియాలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. లైంగిక దాడిని ఎదిరించినందుకు ఏడేళ్ల బాలుడు హత్య

నైజీరియాలోని ఎడో స్టేట్‌లోని ఓ ఇంట్లో సూప్ తాగి ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. ప్రతీకారం తీర్చుకోవాలని ఓ అమ్మాయి తన మాజీ ప్రియుడు తినాల్సిన సూప్‌లో విషం కలిపింది. ఆమె మాజీ ప్రియుడు తన నలుగురు స్నేహితులతో సూప్‌ను పంచుకున్నాడు. సూప్ తాగి ఐదుగురు చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 16 ఏళ్ల ఐషా సులేమాన్‌గా గుర్తించిన బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు బంధాన్ని తెంచుకున్నందుకే ఆమె ఈ హత్యకు కుట్ర పన్నినట్లు తేల్చారు.

ఇది కూడా చదవండి: TB Disease: ప్రమాదకరంగా మారుతున్న ఈ అంటు వ్యాధి.. ప్రతి ఏడాది లక్షల్లో మృత్యువాత

స్థానిక పోలీసుల ప్రకారం.. మృతులు ఇమ్మాన్యుయేల్ ఎలోగీ (19), అడా శామ్యూల్ (16), సోదరులు శామ్యూల్, జెఫ్రీ అయెగ్వాలో, నూరుదీన్‌గా గుర్తించారు. ఈ నలుగు ఇమ్మాన్యుయేల్ నివాసంలో చనిపోయారు. వివిధ గదుల్లో శవాలుగా పడి ఉన్నట్లు గుర్తించారు. కొందరు మంచం మీద.. ఇంకొందరు ఇతరులు గదిలో చనిపోయారు. ఇమ్మాన్యుయేల్ తండ్రి ఎలోజీ ఎజెకిల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 16ఏళ్ల ఐషా సులేమాన్‌ను అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: India-US: భారతీయ కంపెనీలపై అమెరికా వేటు.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?

Show comments