Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన మెలోని
- మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు
- మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీలో ప్రధాని మోడీ-జార్జియా మెలోనికి సంబంధించిన ‘మెలోడీ’ వీడియో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. గంటల వ్యవధిలోనే 10 కోట్ల వ్యూస్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అదంతా ఒకెత్తు అయితే.. ఇప్పుడు మెలోని వ్యక్తిగత జీవితం గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇటలీ తొలి మహిళా ప్రధాని మెలోని పెళ్లి చేసుకున్నారా? లేదంటే సింగిల్‌గా ఉన్నారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. జార్జియా మెలోని ఇప్పటివరకు అధికారికంగా వివాహం చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె సింగిల్‌గా ఉన్నారు. ఇటలీ టెలివిజన్ జర్నలిస్ట్ ఆండ్రియా జియాంబ్రునోతో ఆమె చాలా కాలం రిలేషన్లో(సహజీవనం) ఉన్నప్పటికీ.. 2023లో ఇద్దరూ విడిపోయారు. 2014లో మీడియా, రాజకీయ వర్గాల ద్వారా మెలోని-జియాంబ్రునో పరిచయం ఏర్పడినట్లు సమాచారం.
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Trump - Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా - ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్‌తో నెతన్యాహు ఫైర్!
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Kashmir Issue: పాకిస్థాన్‌పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..

జియాంబ్రునో ఇటలీకి చెందిన మెడియాసెట్ టీవీ ఛానళ్లలో జర్నలిస్టుగా, ప్రెజెంటర్‌గా పనిచేశారు. మెలోని రాజకీయాల్లో ఎదుగుతున్న సమయంలో వీరిద్దరి సంబంధం చాలా కాలం కొనసాగింది. ఈ క్రమంలోనే 2016లో వీరికి గినెవ్రా అనే కుమార్తె జన్మించింది. కుటుంబ విలువలు, మాతృత్వం, క్రమశిక్షణ వంటి అంశాలను మెలోని ఎప్పుడూ తన రాజకీయ గుర్తింపులో భాగంగా చూపించేవారు.

2022లో ఆమె పార్టీ ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ అధికారంలోకి వచ్చిన తర్వాత జియాంబ్రునో తరచూ మెలోనితో పబ్లిక్ ఈవెంట్లలో కనిపించేవారు. అయితే 2023 అక్టోబర్‌లో వీరి సంబంధం ఒక్కసారిగా వివాదాల్లోకి వెళ్లింది. జియాంబ్రునోకు సంబంధించిన కొన్ని బ్యాక్‌స్టేజ్ వీడియోలు ఇటలీ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోల్లో మహిళా సహచరులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు బయటపడటంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఆ తర్వాత మెలోని సోషల్ మీడియాలో అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. ‘‘మా మార్గాలు కొంతకాలంగా వేర్వేరుగా మారాయి’’ అని పేర్కొంటూ.. తన ప్రధాన బాధ్యత తమ కుమార్తెను రక్షించడమేనని చెప్పారు. ఈ సందర్భంగా చిన్నతనంలో తన తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయిన విషయాన్ని కూడా మెలోని గుర్తుచేసుకున్నారు.

విడిపోయిన తర్వాత మెలోని కొత్త రిలేషన్లో ఉన్నారనే సమాచారం బయటకు రాలేదు. ప్రస్తుతం ఆమె సింగిల్ మదర్‌గా.. అదే సమయంలో యూరప్‌లో అత్యంత ప్రభావశీల ప్రభుత్వ నాయకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటలీ ప్రధానిగా.. ఓ కుమార్తెకు తల్లిగా తన బాధ్యతలు నెరవేరుస్తూ ముందుకు సాగిపోతున్నారు.
ఇదిలా ఉంటే ‘మెలోడీ’ మీమ్స్‌తో మెలోని ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఫేవరెట్‌గా మారిపోయారు. యూరప్ రాజకీయాలను దాటి ఆమె పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది.
La mia relazione con Andrea Giambruno, durata quasi dieci anni, finisce qui. Lo ringrazio per gli anni splendidi che abbiamo trascorso insieme, per le difficoltà che abbiamo attraversato, e per avermi regalato la cosa più importante della mia vita, che è nostra figlia Ginevra.… pic.twitter.com/1IpvfN8MgA
— Giorgia Meloni (@GiorgiaMeloni) October 20, 2023
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్‌లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్‌లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!