Site icon NTV Telugu

Death penalty: 12 రాళ్లను సేకరించినందుకు.. ఏకంగా మరణశిక్ష

Death Penalty

Death Penalty

ఇతర దేశాల్లో విధించే శిక్షలతో పోలిస్తే ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ దేశాల్లో విధించే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. చిన్న నేరానికే అక్కడ మరణశిక్షలు విధిస్తుంటారు. తాజాగా ఇరాక్‌లో ఓ బ్రిటీషర్ కూడా మరణశిక్షను ఎదుర్కొంటున్నాడు. అయితే అతడు చేసిన నేరం వింటే ఆశ్చర్యం కలగక మానదు. వివరాల్లోకి వెళ్తే జిమ్ ఫిట్టన్ అనే బ్రిటీషర్ ఓ రిటైర్డ్ జియాలజిస్ట్. అతడు జర్మనీకి చెందిన ఓ సైంటిస్టుతో కలిసి ఇరాక్‌లోని ఎరీదు ప్రాంతంలో ఉన్న ఓ పురావస్తు క్షేత్రాన్ని సందర్శించాడు. ఆ పురావస్తు కేంద్రం నుంచి గుర్తుగా 12 పురాతన రాళ్లను, కొన్ని కుండలు, జాడీలకు చెందిన పెంకులను వాళ్లిద్దరూ సేకరించారు.

Big News : మసీదు బావిలో బయటపడ్డ శివలింగం.. ఎక్కడంటే..?

అయితే తమ పురావస్తు సంపదను అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఇరాక్ అధికారులు ఫిట్టన్, జర్మనీ సైంటిస్ట్ వాల్డ్ మాన్‌ను మార్చి 20న బాగ్దాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం నాడు వారిని ఇరాక్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా తాము నేరపూరిత ఉద్దేశాలతో ఆ రాళ్లను సేకరించలేదని జియాలజిస్టులు కోర్టుకు వివరించారు. తమకు ఇరాక్‌లోని చట్టాలు తెలియదని.. అందుకే రాళ్లను సేకరించామని న్యాయమూర్తి ముందు వాపోయారు. పురావస్తు కేంద్రంలో రాళ్లు సేకరించరాదన్న ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తాము ఈ పని చేశామని తెలిపారు. అయితే ఇరాక్‌లో ఈ నేరం తీవ్రమైనది కావడంతో న్యాయస్థానం మరణశిక్ష విధించింది. కాగా జిమ్ ఫిట్టన్‌ను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలంటూ అతడి కుటుంబ సభ్యులు ఇంగ్లండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఓ పిటిషన్ దాఖలు చేసి సంతకాల సేకరణ ప్రారంభించారు. ఇప్పటివరకు ఫిట్టన్‌కు మద్దతుగా 1.24 లక్షల మంది సంతకాలను వాళ్లు సేకరించారు.

Exit mobile version