G7 Summit: ఉక్రెయిన్‌కు పెరిగిన సైనిక, ఇంధన మద్దతు.. రష్యాపై ఆంక్షలకు జీ7 దేశాలు గ్రీన్‌సిగ్నల్
- ఉక్రెయిన్‌కు పెరిగిన సైనిక, ఇంధన మద్దతు
- రష్యాపై ఆంక్షలకు జీ7 దేశాలు గ్రీన్‌సిగ్నల్
- జీ 7 సదస్సులో ప్రపంచ అధినేతలు కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్‌కు జీ 7 దేశాల నుంచి భారీ మద్దతు లభించింది. మరింత సైనిక, ఇంధన మద్దతు లభించింది. ఈ మేరకు జీ 7 దేశాలన్నీ పూర్తిగా అంగీకరించాయి. అలాగే రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాయి.
ఫ్రాన్స్ వేదికగా జీ 7 సదస్సు జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిచ్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హాజరయ్యారు.
Also Read
ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు మద్దతుగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాన్ని, ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయాలని జీ7 దేశాల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. అలాగే రష్యాపై ఇప్పటికే అమలులో ఉన్న ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. సదస్సు అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌కు అవసరమైన రక్షణ సామగ్రి, సాంకేతిక సహాయం, ఆర్థిక మద్దతును కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ ఇంధన మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఆ దేశ విద్యుత్, ఇంధన రంగాలను పునర్నిర్మించేందుకు సహకారం అందించనున్నట్లు తెలిపారు.
రష్యాపై ఒత్తిడి పెంచేందుకు కొత్త ఆంక్షలు విధించడంతో పాటు ఇప్పటికే ఉన్న ఆంక్షల అమలును మరింత కట్టుదిట్టం చేయాలని జీ7 దేశాలు నిర్ణయించాయి. ముఖ్యంగా రష్యా యుద్ధ యంత్రాంగానికి ఆర్థిక వనరులు అందకుండా చర్యలు తీసుకోవాలని నేతలు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి జీ7 దేశాల నేతలు తమ సంపూర్ణ మద్దతును పునరుద్ఘాటించారు. యుద్ధానికి శాంతియుత పరిష్కారం అవసరమని పేర్కొంటూనే.. ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు అవసరమైన సహాయాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో జీ7 దేశాల ఈ నిర్ణయాలు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాబోయే నెలల్లో ఉక్రెయిన్‌కు మరింత సైనిక, ఆర్థిక సహాయం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
G7 leaders agree to boost Ukraine's defence and energy capabilities, strengthen sanctions on Russia
Read @ANI Story |
https://t.co/DfXZYSyKG9#G7Summit #Russia #Airdefensesystems #Ukraine pic.twitter.com/S3rFrVMtDz— ANI Digital (@ani_digital) June 17, 2026
తాజావార్తలు
-
G7 Summit: ఉక్రెయిన్‌కు పెరిగిన సైనిక, ఇంధన మద్దతు.. రష్యాపై ఆంక్షలకు జీ7 దేశాలు గ్రీన్‌సిగ్నల్
-
Anil Ravipudi: రేపే అనిల్ రావిపూడి కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
Kitchen Hacks: వర్కింగ్ ఉమెన్స్ కోసం కిచెన్ సీక్రెట్స్.. ఈ చిట్కాలతో వంట పని ఇక చిటికెలోనే!
-
Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
-
IND Vs AFG: వీర విహారం చేసిన టీమిండియా బ్యాటర్స్.. ఆఫ్ఘనిస్థాన్ ముందు కొండంత టార్గెట్..
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!