Site icon NTV Telugu

India and Pakistan War: పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించిన జీ7 దేశాలు.. భారత్-పాక్‌ ఉద్రిక్తతలపై కీలక ప్రకటన

G7 Nations

G7 Nations

India and Pakistan War: పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించాయి జీ7 దేశాలు, భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చాయి. క్షిపణి దాడుల ఆరోపణల నేపథ్యంలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని జీ7 దేశాలు శనివారం కోరాయి. పహల్గామ్‌ ఉగ్రదాడి.. ఆ తర్వాత భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఈ రోజు ఓ ప్రకటన చేశాయి జీ7 దేశాలు.. “మేం.. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క జీ7 విదేశాంగ మంత్రులు మరియు యూరోపియన్ యూనియన్ ఉన్నత ప్రతినిధిమి.. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఇదే సమయంలో భారతదేశం, పాకిస్తాన్ రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.. సైనిక ఉధృతి ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. రెండు వైపులా పౌరుల భద్రతపై మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also: Rajnath Singh: పాకిస్తాన్ తాట తీయాల్సిందే.. సైన్యానికి కీలక ఆదేశాలు

ఈ నేపథ్యంలో.. భారత్-పాక్ తక్షణమే ఈ ఉద్రిక్తతలను తగ్గించాలని ఆ ప్రకటన ద్వారా పిలుపునిచ్చాయి జీ7 దేశాలు.. శాంతియుత ఫలితం కోసం రెండు దేశాలు ప్రత్యక్ష సంభాషణలో పాల్గొనాలని సూచించాయి.. మేం ఈ ఘటనలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాం.. వేగవంతమైన మరియు శాశ్వత దౌత్యపరమైన పరిష్కారం కోసం మా మద్దతును తెలియజేస్తున్నాం అని పేర్కొన్నారు.. కాగా, 2025.. G7 అధ్యక్ష పదవిని కెనడా చేపట్టనుంది, ఇది జూన్ 15 నుండి 17 వరకు ఆల్బెర్టాలోని కననాస్కిస్‌లో జీ7 సమావేశాలు జరగనున్నాయి.. అయితే, భారత రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఒక పత్రికా ప్రకటనలో పాకిస్తాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు మరియు నియంత్రణ రేఖ (LOC) వెంబడి 26 ప్రదేశాలలో డ్రోన్లు కనిపించాయని, ఇందులో అనుమానిత సాయుధ డ్రోన్లు కూడా ఉన్నాయని తెలిపింది. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, లాల్‌గఢ్ జట్టా, జైసల్మేర్, బార్మర్, భుజ్, కుర్బెట్ మరియు లఖి నాలా వంటి ప్రదేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. దురదృష్టవశాత్తూ, ఫిరోజ్‌పూర్‌లోని పౌర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని సాయుధ డ్రోన్ దాడి చేయడంతో స్థానిక కుటుంబ సభ్యులు గాయపడ్డారు. వారికి వైద్య సహాయం అందించబడింది మరియు ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు శుభ్రపరిచాయని పేర్కొంది..

Exit mobile version