NTV Telugu Site icon

Sri Lanka Economic Crisis: మరింత పెరిగిన పెట్రో ధరలు.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

Sri Lanka

Sri Lanka

తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక చేతులెత్తేసింది.. కష్టాల నుంచి బయటపడడానికి వరుసగా ధరలను పెంచేస్తోంది.. ఇప్పటికే అప్పులు కట్టడం మా వల్ల కాదు బాబోయ్‌ అంటూ చేతులెత్తేసింది ఆ దేశ ప్రభుత్వం.. మరోసారి పెట్రో ధరలను పెంచింది.. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన, ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి.. పెట్రోలు, డీజల్‌ ధరలను మరింత పెంచింది శ్రీలంక ప్రభుత్వం.. తాజా పెంపుతో శ్రీలంకలో లీటర్ పెట్రోల్‌ ధర 338 రూపాయలకు చేరగా.. లీటరు పవర్ పెట్రోల్ ధర 373 రూపాయలుకు పెరిగింది.. ఇక, లీటర్‌ డీజిల్‌ ధర 329 రూపాయలకు ఎగబాకింది.. అయితే, ధరలు పెంచడంతో ఆందోళనకు దిగారు ప్రజలు.. రైల్వే ట్రాక్‌ల వద్దా, బస్సు బస్టాండ్‌ల దగ్గర ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.. మరోవైపు.. పార్లమెంట్‌నూ ధరల పెంపు విపక్షాల ఆందోళనలకు దిగాయి.. దీంతో.. పలుమార్లు పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయి..

Read Also: Amit Shah Phone to Sai Ganesh Family: సాయి గణేష్‌ కేసు.. రంగంలోకి అమిత్‌షా..!