Site icon NTV Telugu

Bangladesh Crisis: బంగ్లాదేశ్ రాజధానిలో పేలుడు, ఒకరి మృతి..

Bangladesh

Bangladesh

Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభం సమయంలో, ఆ దేశ రాజధాని ఢాకాలో దుండగులు బాంబు దాడి చేశారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) బహిష్కృత నాయకుడు తారిఖ్ రెహమాన్ పర్యటనకు కొద్ది రోజుల ముందు, క్రిస్మస్ పండుగ ముందు రోజు ఢాకాలో తాజా హింస చెలరేగింది. బుధవారం సాయంత్రం రాజధానిలోని మొఘ్‌బజార్ కూడలి వద్ద బంగ్లాదేశ్ ముక్తిజోద్ధా సందస్ సెంట్రల్ కమాండ్ సమీపంలో శక్తివంతమైన నాటు బాంబు పేలుడులో ఒకరు మరణించారు.

Read Also: Aravalli Hills: ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం..

పోలీసుల కథనం ప్రకారం, గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి 7.10 గంటల ప్రాంతంలో మొఘ్‌బజార్ ఫ్లై ఓవర్‌పై నుంచి ఒక నాటుబాంబును విసిరారు. ఈ పేలుడు పదార్థం 21ఏళ్ల సైఫుల్ సియామ్ తలకు తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. దుండగులు హతిర్‌జీత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ ఎస్కటన్ ‌లోని అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ (AG) చర్చికి ఆనుకుని ఉన్న ప్రధాన రహదారిపైకి ఫ్లైఓవర్ పైనుంచి బాంబు విసిరారు. మరణించిన సియామ్ మొఘ్ బజార్ ప్రాంతంలో ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ దుకాణంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సంఘటన సమయంలో అతను టీ కోసం బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది.

Exit mobile version