Frank Hoogerbeets Predicts Turkey Syria Earthquakes 3 Days Before: టర్కీ, సిరియాలను అతలాకుతలం చేసిన భారీ భూకంపాలను ఒక వ్యక్తి ముందుగానే పసిగట్టాడు. భూప్రకంపనలను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే (SSGEOS)కు చెందిన ఫ్రాంక్ హూగర్బీట్స్ అనే పరిశోధకుడు.. దక్షిణ మధ్య టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతాల్లో త్వరలోనే 7.5 తీవ్రతతో భూకంపం సంభవించవచ్చని ఫిబ్రవరి 3వ తేదీన ట్వీట్ చేశాడు. అయితే.. అప్పుడు అతడ్ని ఎవ్వరూ నమ్మలేదు. అతనో నకిలీ శాస్త్రివేత్త అంటూ నెటిజన్లు ధ్వజమెత్తారు. ఎందుకంటే.. గతంలో ఆయన వేసిన అంచనాలన్నీ బోల్తాపడ్డాయి. అందుకే.. ఇలాంటి తప్పుడు ట్వీట్లు వేయొద్దంటూ అతడ్ని మొదట్లో విమర్శించారు.
Vizag Capital: చకచకా విశాఖకు జగన్.. మార్చినుంచి అక్కడే మకాం
కానీ.. ఫ్రాంక్ చెప్పినట్టుగానే మూడు రోజుల తర్వాత టర్కీ, సిరియాలను భూకంపాలు కుదిపేశాయి. 7.8, 7.6, 6.0 తీవ్రతతో వరుసగా మూడు విధ్వంసకర భూకంపాలు ఆ రెండు ప్రాంతాల్ని చిదిమేశాయి. రెండు దేశాల్లో కలిపి 2800కు పైగా బిల్డింగులు నేలమట్టమయ్యాయి. 3400 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలాదిమంది తీవ్ర గాయాలపాలయ్యాయి. భారీ ఆస్తినష్టం జరిగింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మొదటిసారి భూకంపం వచ్చినప్పుడు, మరోసారి భారీ భూకంపం తలెత్తే అవకాశం లేకపోలేదని SSGEOS పోస్ట్ చేసిన ట్వీట్‌ను ఫ్రాంక్ రీట్వీట్ చేశాడు. సరిగ్గా మూడు గంటల తర్వాత 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. తన అంచనా నిజం కావడంతో.. ఫ్రాంక్ విచారం వ్యక్తం చేశాడు. ఈ భూకంప వార్తలు తనని బాధించాయని పేర్కొన్నాడు. అయితే.. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఫ్రాంక్ అంచనాల్ని కొట్టిపారేస్తున్నారు. ఫ్రాంక్ అంచనాలు అశాస్త్రీయమని, తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, అతని అంచనాలకు ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేదని పేర్కొంటున్నారు.
Doomscrolling: ఈ వ్యసనం మీకుందా?.. ఈ చిట్కాలు పాటించండి
కాగా.. టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంప విలయం కారణంగా 3400 మందికి పైగా మృతి చెందారు. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రకృతి వైపరీత్యం సంభవించడంతో, మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. ఊళ్లకు ఊళ్లు శిథిలాలుగా మారిపోయాయి. ఎందరో గాయాలపాలయ్యారు. ఈ భూకంపం వల్ల మరణాల సంఖ్య దాదాపు పది వేలకు చేరే అవకాశం ఉందని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. ఈ శతాబ్దంలోనే దీనిని అతిభీకర భూకంపంగా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాలకు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. అటు.. సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు.
Sooner or later there will be a ~M 7.5 #earthquake in this region (South-Central Turkey, Jordan, Syria, Lebanon). #deprem pic.twitter.com/6CcSnjJmCV
— Frank Hoogerbeets (@hogrbe) February 3, 2023
