France: ఫ్రాన్స్‌లో ఠారెత్తిస్తున్న ఎండలు.. 18 మంది మృతి

  • యూరప్ దేశాలను హడలెత్తిస్తున్న ఎండలు
  • రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
  • ఫ్రాన్స్‌లో 18 మంది మృతి
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
Franceweather

Franceweather

యూరప్ దేశాలను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఇంకోవైపు ఎడారి నుంచి వచ్చే వేడిగాలులు తోడవ్వడంతో ప్రజలు భయకంపితులవుతున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. దీంతో బయటకు రావాలంటేనే గజగజ వణికిపోతున్నారు. దాదాపు 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదు అవ్వడంతో వడగాల్పులకు ప్రజలు అల్లాడిపోతున్నారు.

తీవ్ర వేడిగాలులు, ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు బెంబేలెత్తిపోతున్నారు. యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్‌, స్విట్జర్లాండ్, జర్మనీలో రెడ్ అలర్ట్‌లు కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్‌లో తీవ్ర వేడిగాలుల కారణంగా దాదాపు 18 మంది చనిపోయినట్లుగా అధికారలు తెలిపారు. మృతుల్లో చిన్నారులు ఉన్నట్లు చెప్పారు.

×
×
Ad

ఫ్రాన్స్‌లో అనేక ప్రాంతాల్లో అత్యంత తీవ్రమైన వేడిగాలులు కొనసాగుతున్నాయి. దీంతో వందలాది పాఠశాలలు మూసేశారు. చాలా చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవ్వడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సహారా ఎడారి నుంచి ఉత్తరం వైపు వేడిగాలులు రావడంతో ఫ్రాన్స్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

ఇక లండన్‌లో తీవ్ర వేడిగాలులు ఉంటాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఇక స్పెయిన్‌లో కూడా అత్యధిక వేడి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 1947 తర్వాత ఫ్రాన్స్‌లో అత్యంత వేడిగాలులు ఇప్పుడే వీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.