Site icon NTV Telugu

Monkey Pox: ఫ్రాన్స్‌ను వణికిస్తున్న మంకీపాక్స్‌.. ఒక్కరోజులోనే 51 కేసులు

Monkypox

Monkypox

మంకీపాక్స్ వైరస్‌ కలకలంరేపుతోంది. ఇప్పటికే దాదాపు 50కి పైగా దేశాలకు విస్తరించింది. సుమారు 700 కిపైగా కేసులు బయట పడ్డాయి. మంకీపాక్స్‌ పేరు వినగా ప్రజలంతా జంకిపోతున్నారు. ఇక ఈవైర‌స్ ఫ్రాన్స్‌ను వణికిస్తోంది. దేశంలో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం నాటికి 33గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే వందకు చేరువైంది. ఈ యూరోపియన్‌ దేశంలో మొదటి మంకీపాక్స్‌ కేసు మే నెలలో వెలుగు చూసింది.

వైరస్‌ బాధితులంతా మగవారేనని, అందులోనూ 22 నుంచి 63 ఏండ్ల వయస్కులని ఫ్రెంచ్‌ నేషనల్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఏజెన్సీ తెలిపింది. ఇప్పటివరకు ఒక్కరు మాత్రమే దవాఖానలో చికిత్స తీసుకుని కోలుకున్నారని ప్రకటించింది. దీంతో వయోజనులంతా వీలైనంత తొందరగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 700 మంది మంకీపాక్స్‌ బారిన పడ్డారని అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ తెలిపింది. తమ దేశంలో 21 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. అయితే ఈ వ్యాధి సాధారణంగా రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

Big Breaking : పదో తరగతి ఫలితాలు విడుదల వాయిదా..

Exit mobile version