NTV Telugu Site icon

UK Cabinet Reshuffle Update: రిషి సునక్ మంత్రివర్గంలో బ్రిటిష్ మాజీ ప్రధానికి చోటు..

David Cameron

David Cameron

UK Cabinet Reshuffle Update: బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కేబినేట్‌లో బ్రిటిష్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్‌కు చోటు కల్పించారు. తన కేబినేట్‌ పున:వ్యవస్థీకరలో భాగంగా కామెరూన్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించారు. తాజాగా దీనిపై యూకే ప్రభుత్వం ట్విటర్(X)లో అధికారికంగా ప్రకటించింది. నిజానికి కామెరాన్ యూకే పార్లమెంటుకు ఎన్నిక కాలేదు. అయితే భారత సంతతికి చెందిన విదేశాంగ కార్యదర్శి స్యూయెల్లా బ్రేవర్మన్ వివాదాస్పద వ్యాసం సంచలనంగా మారింది. దీనిపై తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగడంతో ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించారు.

Also Read: Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం

ఇక ఖాళీ అయిన ఈ పదవిని రిషి సునక్ మాజీ ప్రధానీ డేవిడ్ కామెరూన్‌తో భర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో కామెరూన్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ యూకే ప్రభుత్వం ఆమోదించింది. తాజాగా ఈ నియామకం నేపథ్యంలో రిషి సునక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. బ్రిటన్ ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో కామెరాన్ కు సీటు ఇవ్వడానికి కింగ్ చార్లెస్ ఆమోదం తెలిపారు. విదేశీ, కామన్వెల్త్, అభివృద్ధి వ్యవహారాల కార్యదర్శిగా కామెరాన్ నియామకాన్ని కూడా కింగ్ ఆమోదించారు. కాగా పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు చేసిన ఘటనలో ఇప్పటివరకు 140 మందికిపైగా అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని సునాక్ సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ భాగంగా సుయెల్లాను తొలగించారు. ఇదిలావుండగా కేబినెట్ నుంచి మరికొంత మంది తొలగించాలని సునాక్ భావిస్తున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Also Read: OTT Released Movies: ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..