Site icon NTV Telugu

Imran Khan: మరోసారి ఇండియాపై ప్రశంసలు.. జై శంకర్ వీడియోను చూపిస్తూ పొగిడిన ఇమ్రాన్ ఖాన్

Imran Khan

Imran Khan

Former Pakistan Prime Minister Imran Khan praises India’s foreign policy: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై ప్రశంసలు కురిపించారు. తను అధికారం నుంచి దిగిపోయన తర్వాత నుంచి భారత సైన్యాన్ని, భారత ప్రభుత్వాన్ని, భారత దేశ విదేశాంగ విధానాన్ని పొగుడుతున్నారు. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం విదేశాల ఒత్తడితో పనిచేస్తుందని.. పాకిస్తాన్ కు స్వతంత్ర విదేశాంగ విధానం లేదని విమర్శిస్తున్నారు.

మరోసారి ఇమ్రాన్ ఖాన్, భారత ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని పొగిడారు. లాహోర్ లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన పాకిస్తాన్ అమెరికా ఒత్తిడికి తలొగ్గుతోందని విమర్శించారు. ఏకంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ స్లోమేకియాలో జరిగిన బ్రాటిస్లావా ఫోరమ్ లో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను ప్లే చేస్తూ.. భారత విదేశాంగ విధానంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆ సమయంలో జై శంకర్ ని అక్కడి మీడియా… రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆయిల్ కొనుగోలుపై ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు తడుముకోకుండా.. యూరప్ కొంటున్న ఆయిల్ లో చాలా తక్కువ శాతమే కొంటున్నామని.. మాకు, మా ప్రజలకు రష్యా తక్కువ ధరకే ఆయిల్ సరఫరా చేస్తుందని, మేం తక్కవ ధరకు వచ్చిన చోట కొంటామని తేల్చి చెప్పారు. అమెరికా ఒత్తడికి కూడా భారత్ ధృడంగా నిలబడిందని ప్రశంసించారు.

Read Also: Gorantla Madhav: టీడీపీ నేతలకు సవాల్.. చంద్రబాబు వీడియోను అమెరికా ల్యాబ్‌లో టెస్ట్ చేయించాలి

భారత్, పాకిస్తాన్ ఒకే సమయంలో స్వాతంత్య్రం పొందాయని..కానీ భారత్ తన ప్రజల అవసరాల కోసం విదేశాంగ విధానం రూపొందిస్తే.. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీప్ ఇతర దేశాల ఒత్తడిలో ఉన్నారని విమర్శించారు. భారత్, అమెరికాకు వ్యూహాత్మక మిత్రదేశం.. పాకిస్తాన్ కాదు. కానీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని అమెరికా ఒత్తడి తీసుకువచ్చినా.. భారత్ ధృడంగా నిలడిందని అన్నారు. స్వతంత్ర దేశం అంటే భారత్ అని అన్నారు.

Exit mobile version