NTV Telugu Site icon

Lashkar-e-Taiba: భారత్ కు వ్యతిరేకంగా ప్రసంగాలు .. లష్కరే మాజీ కమాండర్ హతం

Untitled 5

Untitled 5

Pakistan: విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పాకిస్థాన్‌లో గురువారం గుర్తు తెలియని వ్యక్తులు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్‌ను కాల్చి చంపారు. వివరాలలోకి వెళ్తే.. భారత్ గురించి వ్యతరేకంగా ప్రసంగాలు చేసే అక్రమ్ గాజీ అలియాస్ అక్రమ్ ఖాన్‌ న్ను పాకిస్థాన్‌ లోని బజౌర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం హత్య చేసారు. కాగా ఇతను తీవ్రవాద సంస్థకు చెందిన ప్రముఖ వ్యక్తి. ఈయన 2018 నుంచి 2020 వరకు LET రిక్రూట్‌మెంట్ సెల్‌కు నాయకత్వం వహించారు. అలానే కొన్ని సంవత్సరాలుగా తీవ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చాడు. ఇక పాకిస్థాన్‌లో భారతదేశం పైన వ్యతిరేకంగా ప్రసంగాలు చేయడంలో ఇతను దిట్ట. కాగా పేరుకు తగ్గట్టే అక్రమ్ అక్రమాలు చేయడంలో ఆరితేరారు.

Read also:World Cup 2023 Final: ప్రపంచకప్‌ 2023 ఫైనల్ చేరే జట్లు ఇవే!

ఉగ్రవాద సంస్థలో విధులు నిర్వహిస్తున్న అక్రమ్ ప్రధాన కర్తవ్యం.. అమాయక యువతను తన మాటాలతో మాయచేసి ఉగ్రవాదులుగా మార్చడం. అలా ఉగ్రవాదులుగా మార్చిన యువతను సంస్థలోకి రిక్రూట్ చేసుకుని వాళ్ళతో చట్ట విరుద్ధ కార్యకలాపాలు చేయించడం ఇదే అతను సంస్థలో నిర్వహించే విధి. కాగా గత కొంతకాలంగా ముష్కరులు ఉగ్రవాదులను టార్గెట్ చేస్తున్నారు. గతంలో ఉగ్రవాద సంస్థలో ప్రధాన విధులను నిర్వహిస్తున్న నాయకులను చంపేశారు. అక్టోబర్‌లో పఠాన్‌కోట్‌ దాడి సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌ను పాకిస్థాన్‌లో కాల్చిచంపారు. అలానే సెప్టెంబర్ లోనూ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ లోని రావల్‌కోట్‌ లోని అల్-ఖుదుస్ మసీదులో లష్కరే తోయిబాకు చెందిన టాప్ టెర్రరిస్టు కమాండర్‌ రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసిమ్‌ని గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు.