NTV Telugu Site icon

US: బంగ్లాదేశ్ అల్లర్లతో సంబంధం లేదు.. ఖండించిన వైట్‌హౌస్

America

America

బంగ్లాదేశ్ అల్లర్లతో తమకు సంబంధం లేదని అమెరికా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జీన్ ప్రియరీ ఖండించారు. ఇది బంగ్లాదేశ్ ప్రజలు ఎంచుకున్న నిర్ణయమని తెలిపారు. వారి భవిష్యత్‌ను నిర్ణయించుకునే అధికారం వారికే ఉందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇది తప్ప ఇంకేమీ ఆరోపణలు వచ్చినా అవన్నీ అవాస్తవమేనని జీన్ ప్రియరీ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక అగ్ర రాజ్యం అమెరికా హస్తం ఉన్నట్లుగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. అమెరికాకు తలవంచకపోవడంతోనే ఈ సమస్య వచ్చినట్లుగా ఆమె పేర్కొన్నారు. షేక్ హసీనా ఆరోపణలు అంతర్జాతీయంగా పెను దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా వైట్‌హౌస్ స్పందిస్తూ ఖండించింది.

ఇది కూడా చదవండి: Sheikh Hasina: షేక్ హసీనాపై కేసు నమోదు.. కారణమిదే..?

కోటా ఉద్యమం బంగ్లాదేశ్‌లో తీవ్ర రూపం దాల్చింది. దీంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు చేదాటి పోవడంతో సైన్యం.. షేక్ హసీనాకు అల్టిమేటం విధించారు. దీంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి కట్టుబట్టలతో భారత్‌కు వచ్చేశారు. ఇక్కడ నుంచి ఆమె యూకేకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అక్కడ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో ఆమె కొద్ది రోజులు ఇండియాలోనే ఉండాలని భావించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే షేక్ హసీనా రాజీనామా తర్వాత.. నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే సోమవారం తాత్కాలిక ప్రభుత్వం నుంచి షేక్ హసీనా కబురు వచ్చింది. దేశానికి తిరిగి రావాలని ఆహ్వానం అందింది. ఇదిలా ఉంటే అల్లర్ల నేపథ్యంలో ఆమెపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. కోటా ఉద్యమం సందర్భంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: Mumbai: పట్టపగలే ఓ వ్యక్తిపై మైనర్ బాలుడు కత్తితో దాడి.. అడ్డొచ్చిన వారిని..!

Show comments