Bangladesh: షేక్ హసీనాకు 6 నెలల జైలు శిక్ష.. అంతర్జాతీయ కోర్టు సంచలన తీర్పు..
- బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి షాక్..
- కోర్టు ధిక్కారంపై కేసులో హసీనాకు ఆరు నెలల జైలుశిక్ష..
- హసీనాకు జైలు శిక్ష అంశంపై అంతర్జాతీయంగా చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఆ దేశ న్యాయస్థానం బిగ్ షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కార కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించిందని అక్కడి స్థానిక మీడియా కథనాలు ప్రచురించాయి. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) ఈ తీర్పును ప్రకటించినట్లు ఢాకాకు చెందిన పలు మీడియా సంస్థలు వార్తలు వెలువరించాయి.
Read Also: Singayya Death Case: సింగయ్యను ఎవరో చంపేశారు.. భార్య సంచలన ఆరోపణలు
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఇక, అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-1 చైర్మన్ జస్టిస్ ఎం.డి. గోలం మోర్టుజా మొజుందర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్షను ఖరారు చేసింది. అలాగే, గైబంధ జిల్లా గోవిందగంజ్‌కు చెందిన షకీల్ అకాండ్ బుల్బుల్కు రెండు నెలల జైలు శిక్ష విధించింది. బుల్బుల్ ఢాకాకు చెందిన రాజకీయవేత్తగా, అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగమైన బంగ్లాదేశ్ ఛత్ర లీగ్ (BCL)తో సంబంధం కలిగి ఉన్నాడు. గత ఏడాది అక్టోబర్‌లో షేక్ హసీనా మరియు షకీల్ బుల్బుల్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ కావడం, దానిపై ఆధారాలు వెలుగులోకి రావడంతో ఆమెపై కోర్టు ధిక్కార కేసు నమోదు అయింది.
అయితే, గత ఏడాది బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకర పరిస్థితులతో ప్రధాని పదవి కోల్పోయి, దేశం వదిలిన షేక్ హసీనా.. భారత్‌లో ప్రస్తుతం ఆశ్రయం పొందుతుంది. ఈ క్రమంలో ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై యూనస్ ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసింది. ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్ సైతం జారీ చేసింది. ఆమెను బంగ్లాకు రప్పించేందుకు మహమద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక సర్కార్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!