Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!

  • ఫ్లైదుబాయ్ ఘటన టెర్రరిస్ట్ అటాక్..
  • కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి గుర్తింపుతో వెలుగులోకి..
  • కాక్‌పిట్‌లో క్రాష్ యాక్స్‌తో కెప్టెన్ స్మిత్‌పై దాడి..
  • విమానాన్ని నియంత్రణలోకి తీసుకుని కూల్చే ప్రయత్నం..
Flydubai Terror Attack

Flydubai Terror Attack

Flydubai Terror Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమాన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తు్న్న విమానాన్ని ఒమన్ జాతీయుడైన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి కూల్చాలని ప్రయత్నించాడు. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై గొడ్డలితో దాడి చేసి ఫ్లైట్ కంట్రోల్స్ తన చేతిలోకి తీసుకుని కూల్చివేయాలని అనుకున్నాడు. స్మిత్ చాలా తెలివిగా కాక్‌పిట్ డోర్ ఓపెన్ చేయడంతో ప్రయాణికులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. చివరకు సౌదీ అరేబియాలోని ఒక చిన్న ఎయిర్‌పోర్టులో 180 మందితో కూడిన విమానం సురక్షితంగా ల్యాండైంది.

అయితే, ఈ ప్రమాదంపై యూఏఈ కీలక ప్రకటన చేసింది. యూఏఈ ప్రాసిక్యూటర్లు ఈ ఘటనను ‘‘ టెర్రరిస్ట్ అటాక్’’గా అభివర్ణించారు. విమానాన్ని క్రాష్ చేసేందుకు కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేశాడని యూఏఈ అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం యూఏఈ అధికారులు నిందితుడైన కో-పైలట్ హమ్మామిని విచారిస్తున్నారు.

ప్రస్తుతం యూఏఈ, ఇజ్రాయిల్ కో-పైలట్ ఒంటరిగా దాడి చేశాడా.? లేక ఏదైనా తీవ్రవాద సంస్థతో సంబంధం ఉండా? అనే కోణంలో విచారిస్తున్నారు. దీనికి ముందు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. కోపైలట్ తీవ్ర ఇస్లామిక్ భావజాలానికి ప్రభావితమై ఉండొచ్చని, ఇరాన్ లింక్ ఉందా అనే దానిపై దర్యాప్తు అవసరమని అన్నారు. ఈ దాడిలో గాయపడిన కెప్టెన్ పైలట్ స్మిత్ మచ్చర్ యూఏఈలో చికిత్స పొందుతున్నారు. ఆయన ధైర్యాన్ని ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ కొనియాడారు.