Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- ఫ్లైదుబాయ్ ఘటన టెర్రరిస్ట్ అటాక్..
- కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి గుర్తింపుతో వెలుగులోకి..
- కాక్‌పిట్‌లో క్రాష్ యాక్స్‌తో కెప్టెన్ స్మిత్‌పై దాడి..
- విమానాన్ని నియంత్రణలోకి తీసుకుని కూల్చే ప్రయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flydubai Terror Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమాన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తు్న్న విమానాన్ని ఒమన్ జాతీయుడైన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి కూల్చాలని ప్రయత్నించాడు. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై గొడ్డలితో దాడి చేసి ఫ్లైట్ కంట్రోల్స్ తన చేతిలోకి తీసుకుని కూల్చివేయాలని అనుకున్నాడు. స్మిత్ చాలా తెలివిగా కాక్‌పిట్ డోర్ ఓపెన్ చేయడంతో ప్రయాణికులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. చివరకు సౌదీ అరేబియాలోని ఒక చిన్న ఎయిర్‌పోర్టులో 180 మందితో కూడిన విమానం సురక్షితంగా ల్యాండైంది.
అయితే, ఈ ప్రమాదంపై యూఏఈ కీలక ప్రకటన చేసింది. యూఏఈ ప్రాసిక్యూటర్లు ఈ ఘటనను ‘‘ టెర్రరిస్ట్ అటాక్’’గా అభివర్ణించారు. విమానాన్ని క్రాష్ చేసేందుకు కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేశాడని యూఏఈ అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం యూఏఈ అధికారులు నిందితుడైన కో-పైలట్ హమ్మామిని విచారిస్తున్నారు.
Also Read
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
ప్రస్తుతం యూఏఈ, ఇజ్రాయిల్ కో-పైలట్ ఒంటరిగా దాడి చేశాడా.? లేక ఏదైనా తీవ్రవాద సంస్థతో సంబంధం ఉండా? అనే కోణంలో విచారిస్తున్నారు. దీనికి ముందు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. కోపైలట్ తీవ్ర ఇస్లామిక్ భావజాలానికి ప్రభావితమై ఉండొచ్చని, ఇరాన్ లింక్ ఉందా అనే దానిపై దర్యాప్తు అవసరమని అన్నారు. ఈ దాడిలో గాయపడిన కెప్టెన్ పైలట్ స్మిత్ మచ్చర్ యూఏఈలో చికిత్స పొందుతున్నారు. ఆయన ధైర్యాన్ని ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ కొనియాడారు.
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!