ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసి పోరాడాలని బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. రష్యాలోని కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పుతిన్‌పై ప్రశంసలు కురిపించారు. బ్రిక్స్ సమావేశాన్ని పుతిన్ విజయవంతంగా నిర్వహించారంటూ కొనియాడారు. భవిష్యత్‌లో బ్రిక్స్ మరింత పటిష్టమైన వేదిక అవుతుందని ఆకాంక్షించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిపై బ్రిక్స్ దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచంలో 40 శాతం జనాభాకు బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమాన్ని భారత్‌లో చేపట్టినట్లు గుర్తుచేశారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండటం సరికాదని.. ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన మద్దతు అవసరమని.. ద్వంద్వ ప్రమాణాలకు చోటు లేదన్నారు. అలాగే గ్లోబల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో సంస్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇక బ్రిక్స్ దేశాలు లోకల్ కరెన్సీ ద్వారా వ్యాపారం చేసుకోవడాన్ని ప్రోత్సహించాలని ప్రధాని మోడీ కోరారు.
ఇది కూడా చదవండి: Pushpa 2: The Rule: సడన్ గా మీడియా ముందుకు పుష్ప టీం.. షాకేం ఇవ్వరు కదా!
ద్రవ్యోల్బణం, ఆహార భద్రత, సైబర్ బెదిరింపులు వంటి ప్రపంచ సవాళ్లను గురించి కూడా మోడీ ప్రస్తావించారు. ‘‘ద్రవ్యోల్బణాన్ని నిరోధించడం, ఆహారం మరియు ఇంధన భద్రత, ఆరోగ్య భద్రత మరియు నీటి భద్రతను రక్షించడం ప్రపంచంలోని అన్ని దేశాలకు ప్రాధాన్యతనిచ్చే అంశాలు’’ అని మోడీ పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్‌స్టిట్యూషన్‌లలో సంస్కరణల కోసం బ్రిక్స్ భాగస్వాములు సమిష్టిగా తమ గళాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. సురక్షితమైన కృత్రిమ మేధస్సుతో పాటు సైబర్ భద్రత కోసం ప్రపంచ నిబంధనల కోసం దేశాలు కృషి చేయాలన్నారు.
ఇది కూడా చదవండి: Minister Sridhar Babu: ఎవ్వరిని వదిలి పెట్టం.. కాంగ్రెస్ నేత హత్యపై మంత్రి సీరియస్
My remarks during the BRICS Summit in Kazan, Russia. https://t.co/TvPNL0HHd0
— Narendra Modi (@narendramodi) October 23, 2024