Site icon NTV Telugu

కాబూల్ ఎయిర్‌పోర్ట్.. కాల్పులు, తొక్కిస‌లాట‌, ఏడుగురు మృతి

తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో అరాచకం రాజ్యమేలుతోంది… తాలిబన్లు తమకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు.. తాజాగా ఆఫ్ఘన్‌ రాజధానిలోని కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర తాలిబన్లు గాల్లోకి కాల్పలులు జరిపారు.. ఇతర దేశస్తులతో పాటు.. ఆఫ్ఘన్‌లు దేశాన్ని వీడేందుకు ప్రయత్నాలు చేస్తూ.. ఎయిర్‌పోర్ట్‌లకు పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారు.. అయితే, వారిని నిలువరించడానికి కాబూల్‌ ఎయిర్‌పోర్ట్ దగ్గర కాల్పులు జరిపారు తాలిబన్లు.. దీంతో.. భయాందోళనకు గురైన ప్రజలు.. ఒక్కసారిగా పరుగులుపెట్టారు.. దీంతో తొక్కిస‌లాట జరిగింది.. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందిన‌ట్లు బ్రిట‌న్ ర‌క్షణ శాఖ పేర్కొంది. ఇక, కాబూల్‌లో ప‌రిస్థితి ఇప్పటికీ గందరగోళంగానే ఉంది.. సాధ్యమైనంత సుర‌క్షితంగా ఉంచ‌డానికి తాము ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించింది బ్రిట‌న్ ర‌క్షణ శాఖ.

Exit mobile version