NTV Telugu Site icon

Japan: ఆర్మీ ట్రైనింగ్ రేంజ్‌లో కాల్పులు.. ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

Army

Army

Japan: జపాన్‌లోని ఒక ఆర్మీ ట్రైనింగ్ రేంజ్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డట్టు స్థానిక మీడియా ప్రకటించింది. ఉదయం 9.00 గంటలకు, హినో ప్రాథమిక ఫైరింగ్ రేంజ్ వద్ద ఆత్మరక్షణ సభ్యుడు కాల్పులు జరిపిన ఘటన జరిగిందని.. అందులో ముగ్గురు ఆత్మ రక్షణ సిబ్బంది గాయపడ్డారని ప్రభుత్వ ఉన్నతాధికారి హిరోకాజు మట్సునో తెలిపారు. ఈ ఘటనలో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారి ధృవీకరించారు.

Read also: Rakul Preet Singh: వామ్మో.. సినిమా కోసం అంత పెద్ద సాహసం చేసిందా?

జపనీస్ సెంట్రల్ ప్రిఫెక్చర్ గిఫులోని హినో సిటీలోని ఎస్‌డిఎఫ్ షూటింగ్ రేంజ్ వద్ద ఉదయం 9 గంటలకు ఈ సంఘటన జరిగిందని చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ హిరోకాజు మట్సునో తెలిపారు. ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిగాయని ఎస్‌డిఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. కాల్పుల తర్వాత ఇద్దరు ఎస్‌డీఎఫ్‌ సిబ్బంది కార్డియోపల్మోనరీ అరెస్ట్‌కు గురైనట్టు తెలిపారు. పౌరుల ప్రాణనష్టం జరగలేదని పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ తెలిపింది.

Read also: Update Aadhar Card : ఆధార్ కార్డ్‌ను ఫ్రీగా అప్‌డేట్ చేయడానికి రేపే లాస్ట్ డే

కాల్పులు జరిపిన వ్యక్తి టీనేజ్ ఎస్‌డీఎఫ్‌ సభ్యునిగా గుర్తించారు. జపాన్‌లో కాల్పులు చాలా అరుదుగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ తుపాకీ లైసెన్స్ పొందడం చాలా కఠినంగా ఉంటుంది. తుపాకీని కలిగి ఉండాలనుకునే ఎవరైనా కఠినమైన పరిశీలన తరువాతనే లైసెన్స్ ను పొందుతారు.