Site icon NTV Telugu

Fire Ants: స్కైడైవింగ్ చేస్తూ 14 వేల అడుగుల నుంచి కింద పడిన మహిళ.. కాపాడిన అగ్ని చీమలు

Joan Murrey

Joan Murrey

స్కైడైవింగ్ చేస్తూ 14వేల అడుగుల ఎత్తునుంచి కింద పడిన ఓ మహిళ విచిత్ర పరిస్థితిలో ప్రాణాలతో బయటపడింది. నిజానికి అంత ఎత్తు నుంచి పడితే బ్రతకడం అనేది అసాధ్యం. కానీ ఆమెపై దాడి చేసిన అగ్ని చీమల వల్లే ప్రాణాల నిలబడటం విచిత్రం. ఈ సంఘటన 1999లో చోటు చేసుకోగా.. ఈ విషయాన్ని రీసెంట్‌గా సదరు మహిళ మీడియాతో పంచుకుంది. దీంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇంతకి ఏం జరిగిందంటే.. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన జోన్ ముర్రె బ్యాంక్ ఎక్స్‌కూటివ్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో 1999 సెప్టెంబర్‌లో తన భర్తతో కలిసి స్కైడైవింగ్‌కు దిగింది.

Also Read: Rapido: మహిళపై రాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు.. ఆటో నుంచి తోసేసి..

14500 ఎత్తులో ఎగురుతున్న విమానం నుంచి పారాచూట్ సాయంతో దూకేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో పారాచూట్ తెరుచుకోలేదు. అలాగే అత్యవసర పరిస్థితితో సాయం అందించాల్సిన సెకండరీ పారాచూట్ కూడా పని చేయలేదు. దీంతో ముర్రె గంటకు ఎనభై మైళ్ల వేగంతో భూమిపైకి దూసుకెళ్లి కింది పడిపోయింది. ఆ సమయంలో ఆమె అగ్ని చీమల దండు పడటంతో అవి ఆమెపై ఎటాక్ చేశాయి. అంత ఎత్తు నుంచి పడిపోవడంతో తీవ్ర గాయలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ముర్రెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ టైంకి ముర్రె కొన ఊపిరిలో ఉంది.

Also Read: Sandra Venkata Veeraiah: నూటికి నూరు శాతం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు..

దీంతో వైద్యులు ఆమెకు వెంటనే చికిత్స అందించారు. ఇక రెండు వారాల పాటు కోమాలో ఉన్న ముర్రె పలు సర్జరీల అనంరతం ప్రాణాలతో బయటపడింది. అయితే ముర్రె ప్రాణాలతో ఉండటానికి కారణం అగ్ని చీమల అని ఆమె వైద్యులు తెలిపారు. ముర్రెను అగ్ని చీమలు కుట్టడం వల్ల తన శరీరంలోని నరాలు ఉత్తేజితమయ్యాయని, దాని వల్ల ఆమె గుండె కొట్టుకనే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లే వరకు అగ్ని చీమలు ఆమె ప్రాణాలతో ఉండేలా సహాయపడ్డాయని వైద్యులు పేర్కొన్నారు.

Exit mobile version