Site icon NTV Telugu

Trump T-shirts: ట్రంప్ దాడిపై “టీ-షర్ట్‌లు”.. ఇంత ఫాస్ట్‌గా ఎలారా..?

Trump T Shirts

Trump T Shirts

Trump T-shirts: పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే నిందితుడు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని హతమార్చారు.

Read Also: BJP: ట్రంప్ హత్యాయత్నం.. రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై హింసను ప్రోత్సహిస్తున్నాడు..

ఇలా దాడి జరిగిందో లేదో, దానిని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు. దాడి తర్వాత ట్రంప్ చేతులు బిగించి, తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ‘‘ఫైట్ ఫైట్ ఫైట్’’ అంటూ నినదించారు. ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది. ఈ చిత్రాలతో ఏకంగా టీ-షర్టులు రెడీ అవుతున్నాయి. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం, శనివారం సాయంత్రం 6.15 గంటలకు హత్యాయత్నం జరిగింది. 6.31 గంటలకు పిడికిలి పైకెత్తిన ట్రంప్ ఫోటో రిలీజ్ అయింది. రాత్రి 8 గంటలకు అధ్యక్షుడు జో బైడెన్ ఈ దాడిని ఖండించారు.

Read Also: Chandipura virus: గుజరాత్‌లో ‘‘చండీపురా వైరస్’’ కలకలం.. నలుగురు పిల్లలు మృతి..

అయితే, ఈ సమయానికే చైనా తయారీదారులు ట్రంప్ పిడికిలి పైకెత్తిన ఫోటోతో టీషర్టుని తయారు చేశారు. పెద్ద సంఖ్యలో వీటిని ఉత్పత్తి చేసేందుకు చైనా తయారీదారులు సిద్ధమయ్యారు. మొదటి బ్యాచ్ టీ-షర్టులు ప్రముఖ చైనీస్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన టావోబావోలో రాత్రి 8.40 గంటలకు అమ్మకానికి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దేశాధినేతలు స్పందించే లోపే టీ-షర్టుల తయారీ మొదలైంది. మూడు గంటల్లోనే చైనా, యూఎస్ నుంచి 2000 కంటే ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు టావోబావో చెప్పింది.

Exit mobile version