NTV Telugu Site icon

FIFA World Cup: “రెయిన్ బో” టీ షర్టు ధరించిన జర్నలిస్టు.. నిర్భంధించిన ఖతార్ అధికారులు

Fifa World Cup

Fifa World Cup

FIFA World Cup, detention of US journalist for wearing rainbow t-shirt: ఇస్లామిక్ దేశం ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ జరుగుతోంది. దీని కోసం ఖతార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే ఇస్లాం కట్టుబాట్లను ఖచ్చితంగా పాటించే ఖతార్ దేశంలో వెస్ట్రన్ దేశాల వారు ఇబ్బందులు పడుతున్నారు. మద్యంతో పాటు డ్రెస్సింగ్ పై నిక్కచ్ఛిగా వ్యవహరిస్తోంది ఖతార్ ప్రభుత్వం.

ఇదిలా ఉంటే రెయిన్ బో టీషర్టు ధరించిన అమెరికా దేశానికి చెందిన స్పోర్ట్స్ జర్నలిస్టును అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఫుట్ బాల్ జరుగుతున్న స్టేడియంలోకి అనుమతించ లేదని, బయటనే నిర్భంధించారని మంగళవారం జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై అనేక మంది నెటిజెన్లు ఆయనకు మద్దతు ప్రకటించగా.. ముఖ్యంగా ఖతారీ ప్రజలు ఆయన చేసిన పనకి తిడుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

Read Also: Himanta Biswa Sarma: హిందూ అమ్మాయిలు ఎమోషనల్.. “లవ్ జీహాద్”పై కఠిన చట్టం అవసరం

డాక్టర్ నయీఫ్ బిన్ నహార్ అనే ఖతారీ స్కాలర్ ట్వీట్ చేస్తూ.. ఒక ఖతారీగా ఖతార్ చేసిన పనికి గర్వ పడుతున్నాని..పాశ్యాత్యులు తమ విలువలు, ఆచారాలు విశ్వ వ్యాప్తం కావని ఎప్పుడు గ్రహిస్తారో నాకు తెలియదని.. విభిన్న విలువలు సంస్కృతులు ఉన్నాయి. అన్నింటిని సమానంగా గౌరవించాలని, పాశ్చాత్యులు మానవత్వానికి ప్రతినిధులు కాదనే విషయాన్ని మరిచిపోకూడదని పోస్ట్ చేశాడు. ఈ ప్రాంత సంస్కృతిని గౌరవించండి, నాగరిక వ్యక్తిగా నియమాలు పాటించడంటూ మరో ఖతార్ జాతీయుడు ట్వీట్ చేశారు.

ఖతార్ వేదికగా జరుగున్న ఫిఫా వరల్డ్ కప్ లో యూఎస్-వేల్స్ గేమ్ కోసం స్టేడియంలోకి ప్రవేశించకుండా నన్ను అడ్డుకున్నట్లు గ్రాంట్ వాల్ ట్వీట్ చేశాడు. నువ్వు చొక్కా మార్చుకోవాలని, దీంతో అనుమతించమని అక్కడి అధికారులు చెప్పినట్లు ట్వీట్ చేశారు. రెయిన్ బో సింబర్ ని స్వలింగ సంబంధాలకు మద్దతుగా రెయిన్ బో చిహ్నాన్ని ఉపయోగిస్తారు. అయితే ఖతార్ వంటి దేశాల్లో స్వలింగ సంబంధం అనేది తీవ్ర నేరం. అందుకే అక్కడి అధికారులు గ్రాంట్ వాల్ ని అడ్డుకున్నారు. దాదాపుగా 25 నిమిషాల పాటు నిర్భంధించి టీషర్టు తీసేయాలని చెప్పారు.