Site icon NTV Telugu

గర్భం దాల్చిన మహిళ.. స్కానింగ్ రిపోర్టు చూసి షాకైన డాక్టర్లు

మహిళలకు గర్భం దాల్చడం అనేది వారి జీవితంలో కలిగే మధురానుభూతి. మహిళలు గర్భం దాలిస్తే కడుపులోని బిడ్డ గర్భాశయంలో పెరగడం సాధారణ విషయం. కానీ ఓ మహిళకు మాత్రం కడుపులోని బిడ్డ కాలేయంలో పెరుగుతుండటం వైద్యులనే ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళ్తే… కెనడాలోని 33 ఏళ్ల మహిళకు వింత అనుభవం ఎదురైంది. తాను గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించిన తరువాత 14 రోజులుగా రుతుస్రావం అవుతుండటంతో ఆమె చెకప్ చేయించుకునేందుకు వైద్యుల వద్దకు వెళ్లింది. అయితే ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసిన వైద్యులు… కాలేయం(లివర్)లో పిండం పెరుగుతుండాన్ని గమనించారు. అయితే కాలేయంలో పెరుగుతున్న పిండంలో బిడ్డ చనిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు. శస్త్ర చికిత్స ద్వారా కాలేయంలోని పిండాన్ని తొలగించి మహిళను బతికించామని వారు వెల్లడించారు.

Read Also: ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన ఘనత

గ‌ర్భాశ‌యం వెలుప‌ల‌ అండం త‌న‌కు తానే ఫ‌ల‌దీక‌ర‌ణం చెంద‌డం వ‌ల్ల ఇలాంటి గ‌ర్భం వచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని డాక్టర్ మైఖేల్ వివరించారు. తన జీవితంలో చాలా రకాల కేసులను చూశానని.. కానీ ఇలాంటి కేసును ఎప్పుడూ చూడలేదని డాక్టర్ మైఖేల్ వెల్లడించారు. నిజానికి అండాశ‌యం నుంచి గ‌ర్భకోశానికి ఒక పైప్‌లాంటి మార్గం ఉంటుందని… ఆ మార్గం ద్వారా గ‌ర్భాశయానికి అండాలు ప్రయాణిస్తాయన్నారు. మ‌ధ్యలో ఏ అండం అయినా ఇరుక్కుపోతే.. అక్కడే పిండంలా ఏర్పడుతుందన్నారు. కానీ.. ఆ పిండంలో ఎదుగుద‌ల ఉండ‌దని.. అటువంటి గ‌ర్భం కూడా నిల‌బ‌డ‌దని స్పష్టం చేశారు. ఈ మ‌హిళ విష‌యంలో కూడా అదే జ‌రిగింది… కానీ ఇటువంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయ‌ని ఆయన అభిప్రాయపడ్డారు.

https://www.instagram.com/p/CXksHRUNk49/?utm_medium=copy_link

Exit mobile version