Donald Trump: రష్యా-ఉక్రెయిన్ శాంతికి ట్రంప్ ప్రణాళిక ఇదేనా..?
- ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ ప్రణాళిక సిద్ధం..?
- ఇరు దేశాల మధ్య 800 మైళ్ల బఫర్ జోన్..
- యూరోపియన్ దళాలతో పెట్రోలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రణాళికతో సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని పలు సందర్భాల్లో ట్రంప్ చెప్పాడు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ సైన్యాల మధ్య 800 మైళ్ల బఫర్ జోన్ అమలు చేయడానికి యూరోపియన్ సైనికులకు పిలుపునిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also: PM Modi: “ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే”.. జార్ఖండ్‌లో నినదించిన మోడీ..
Also Read
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
ట్రంప్ శాంతి ప్రణాళిక, అతడి ముగ్గురు సిబ్బందిచే వివరించబడింది. ప్రస్తుతం ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరాలనే నిర్ణయాన్ని విడిచిపెట్టేందుకు అంగీకరించే అవకాశం ఉందని ది టెలిగ్రాఫ్ నివేదించింది. బదులుగా ఉక్రెయిన్‌కి అతిపెద్ద ఆయుధ సహకారాన్ని, నిధులను అందిస్తున్న యూఎస్, రష్యా యుద్ధాన్ని మళ్లీ పున: ప్రారంభించకుండా నిరోధించేందుకు ఉక్రెయిన్‌కి పూర్తి ఆయుధాలను పంపుతుంది. దీంతో పాటు బఫర్ జోన్లో పెట్రోలింగ్ చేసేందుకు యూఎస్ తన దళాలను పంపదు. ఈ బఫర్ జోన్లో అమెరికా సైన్యం కాకుండా పోలాండ్, జర్మన్, బ్రిటన్, ఫ్రెంచ్ దళాలను పంపించేందుకు వీలు కలుగుతుందని ట్రంప్ బృందంలోని ఒక సభ్యుడు చెప్పినట్లు ది టెలిగ్రాఫ్ నివేదించింది.
ఇటీవల ట్రంప్ గెలిచిన తర్వాత రష్యా అధినేత పుతిన్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఓ కార్యక్రమంలో ట్రంప్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నారా..? అని పుతిన్‌ని ప్రశ్నిస్తే, తాను సిద్ధమే అని చెప్పారు. అయితే, రష్యా బలగాలన్నింటిని బహిష్కరించి, క్రిమియాతో సహా రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాలను తిరిగి ఇచ్చే వరకు శాంతిని నెలకొల్పలేమని జెలెన్ స్కీ పదేపదే చెబుతున్నారు. రష్యా 2014లో క్రిమియా ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకుంది. ఇది ఉక్రెయిన్ భూభాగంలో 20 శాతం లోపు ఉంటుంది.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!