Site icon NTV Telugu

Erika kirk: చార్లీ కిర్క్ హత్యపై స్నేహితురాలు సంచలన ఆరోపణలు.. ఎరికా కిర్క్ తీవ్ర ఆగ్రహం

Erika Kirk

Erika Kirk

ట్రంప్ సన్నిహితుడు, జాతీయ వాది చార్లీ కిర్క్ వ్యవహారం మరోసారి తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఓ వైపు చార్లీ కిర్క్ సమాధి రహస్యంగా ఉంచడం.. ఇంకోవైపు చార్లీ కిర్క్‌ను కుటుంబ సభ్యులు, టర్నింగ్ పాయింట్ యూఎస్ బృందమే హత్య చేశారంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా చార్లీ కిర్క్ స్నేహితురాలిగా చెప్పుకుంటున్న కాండేస్ ఓవెన్స్ సంచలన ఆరోపణలు చేశారు.

ఇది కూడా చదవండి: PM Modi: పార్లమెంట్‌లో అమిత్ షా ప్రసంగంపై మోడీ ఫిదా.. శభాష్ అంటూ ప్రధాని ట్వీట్

చార్లీ కిర్క్ హత్య వెనుక ఇజ్రాయెల్, ఫ్రాన్స్, యూఎస్ మిలిటరీ, టర్నింగ్ పాయింట్ యూఎస్ బృందం సహా వివిధ గ్రూపుల ప్రమేయం ఉందని కాండేస్ ఓవెన్స్ తీవ్ర ఆరోపణలు చేశారు. చంపింది ఒకరైతే.. టైలర్ రాబిన్సన్ అరెస్ట్ చేశారని.. ఇది అసలు కరెక్టే కాదని వ్యాఖ్యానించారు. తొలుత హత్యలో ఇజ్రాయెల్ ప్రమేయం ఉందని ఆరోపించగా.. అనంతరం ఫ్రెంచ్ ప్రభుత్వ పాత్ర ఉందని చెప్పారు. అటు తర్వాత టర్నింగ్ పాయింట్ యూఎస్ మోసం చేసిందని.. అంతేకాకుండా ఇందులో యూఎస్ సైన్యం పాత్ర కూడా ఉందంటూ ఆరోపించింది.

ఎరికా కిర్క్ ఆగ్రహం..
చార్లీ కిర్క్ హత్య, రహస్య సమాధిపై వస్తున్న ఆరోపణలపై ఎరికా కిర్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాక్స్ న్యూస్‌తో ఎరికా కిర్క్ మాట్లాడుతూ.. కాండేస్ ఓవెన్స్ పేరు ప్రస్తావించకుండానే మండిపడ్డారు. చార్లీ కిర్క్ హత్యపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను దేశ న్యాయ ప్రక్రియను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. తన భర్తతో కలిసి పని చేసిన వ్యక్తులపై ఆరోపణలు చేసి డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారని.. ఈ విషయంలో మౌనంగా ఉండదల్చుకోలేదన్నారు. తన భర్తతో పని చేసిన వారంతా ఇప్పుడు వేధింపులు ఎదుర్కొంటున్నారని.. ఏం జరిగిందో తెలియక దు:ఖిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం తిరిగి నిర్మాణంలో బిజీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని.. తనకు.. తన భర్తకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు డిమాండ్ చేశారు. ఇక తన భర్త సమాధి అపవిత్రం కాకుండా ఉండేందుకు రహస్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Trump: అమెరికా పౌరసత్వానికి ‘గోల్డెన్ ఆఫర్’.. శుభవార్త చెప్పిన ట్రంప్

ఫాక్స్ న్యూస్‌లో ఎరికా కిర్క్ మాట్లాడిన సంభాషణ చూశానని.. పేరు ప్రస్తావించకుండా ఆగ్రహం వ్యక్తం చేసింది తనపైనేనని కాండేస్ ఓవెన్స్ తెలిపారు. ఈ విషయంలో ఎవరూ చింతించకండి అన్నారు.

మొత్తానికి చార్లీ కిర్క్ హత్య వ్యవహారం తాజాగా తీవ్ర దుమారం రేపుతోంది. సమాధి రహస్యంగా ఉంచడం, ఇంకోవైపు చార్లీ కిర్క్ బృందమే చంపేశారంటూ ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. మరోవైపు ఇటీవల ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఎరికా కిర్క్ గట్టిగా కౌగిలించుకోవడం కూడా సంచలనంగా మారింది. అయితే కుట్ర కోణాలను ప్రజలు తిప్పికొట్టాలని ఎరికా కిర్క్ కోరారు.

Exit mobile version