Site icon NTV Telugu

Erika Kirk: ఆ వీడియోను ఎప్పటికీ చూడబోను.. ఎరికా కిర్క్ వెల్లడి

Erika Kirk

Erika Kirk

ఆ వీడియోను ఇప్పటి వరకు చూడలేదని.. ఎప్పటికీ చూడను.. చూడబోనని చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ తెలిపింది. ట్రంప్ సన్నిహితుడు, టర్నింగ్ పాయింట్ యూఎస్ వ్యవస్థాపకుడు చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10, 2025న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. తాజాగా భర్త హత్యకు సంబంధించిన వీడియోపై ఎరికా కిర్క్ మాట్లాడుతూ.. ఆ వీడియోను ఇప్పటి వరకు చూడలేదని.. ఎప్పటికీ చూడబోనని ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఇటీవల ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఎరికా కిర్క్ చాలా దగ్గరగా మూవ్ అయ్యారు. టర్నింగ్ పాయింట్ యూఎస్ కార్యక్రమంలో జేడీ వాన్స్‌ను చాలా గట్టిగా కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఇద్దరి మధ్య సంబంధం బలపడుతుందంటూ నెటిజన్లు కోడైకూశారు. ఇదే ఈవెంట్‌లో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తన భార్య హిందువు అని.. ఆమె ఇంకా క్రైస్తవ్యంలోకి రాలేదని చెప్పారు. ప్రస్తుతం మారే ఉద్దేశం కూడా ఆమెకు లేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి.

Exit mobile version