Israel-Turkey: టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా వేల మంది జనాలతో అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ పాలస్తీనా అనుకూల ర్యాలీ నిర్వహించారు. వేల మంది సాక్షిగా ఇజ్రాయిల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయిల్ గత 22 రోజులుగా బహిరంగ యుద్ద నేరాలకు పాల్పడుతోందని, అయితే పాశ్చాత్య నాయకులు కాల్పుల విరమణ కోసం పిలుపునివ్వలేదని ఎర్డోగాన్ అన్నారు.
ఇజ్రాయిల్ యుద్ధ నేరస్తుడిగా ప్రపంచమంతా చెబుతామని, ఇందుకు సన్నాహాలు చేస్తున్నామని, యుద్ధ నేరస్తుడిగా ప్రకటిస్తామని వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్ ని ఓ ఆక్రమణదారుగాగా అభివర్ణిస్తూనే, హమాస్ ఉగ్రవాద సంస్థ కాదని మరోసారి చెప్పాడు. అంతకుముందు పాలస్తీనా మిలిటెంట్ గ్రూస్ హమాస్ ను స్వాతంత్ర సమరయోధులుగా పిలిచాడు. ఈ సమస్యకు కారణం వెస్ట్రన్ దేశాలే అని నిందించాడు.
Read Also: Bhatti Vikramarka: ఈసారి రాబోయేది ప్రజాప్రభుత్వం.. ప్రజలందరి సంక్షేమ ప్రభుత్వం
ఇదిలా ఉంటే ఎర్డోగాన్ వ్యాఖ్యలకు ఇజ్రాయిల్ కూడా తీవ్రంగానే స్పందించింది. ఇస్తాంబుల్ లో భారీ ప్రదర్శన తర్వాత ఇజ్రాయిల్ టర్కీలోని తన దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది. టర్కీ నుంచి తిరిగి రావాలని తమ పౌరులను కోరింది. టర్కీ నుంచి వస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఇజ్రాయిల్-టర్కీల మధ్య సంబంధాలను పున:పరిశీలించడానికి నేను మా దౌత్యవేత్తలను తిరిగి రమ్మని ఆదేశించినట్లు ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి కోహెన్ ఎక్స్(ట్విట్టర్)లో తెలిపారు.
ఇజ్రాయిల్- హమాస్ యుద్ధంలో ఇరాన్ తర్వాత హమాస్ కి టర్కీ నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. టర్కీ దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ బహిరంగంగానే హమాస్ కి మద్దతు తెలుపుతున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు 1400 మందిని చంపేశారు. 200 మందిని బందీలుగా తీసుకున్నారు. దీంతో ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై వరసగా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఉగ్రవాదులతో పాటు సాధారణ పాలస్తీనా ప్రజలు మరణిస్తున్నారు. గాజాలో 7000కు పైగా ప్రజలు మరణించారు.