Site icon NTV Telugu

Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల.. కొత్త ఫొటోల్లో బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్

Epstein Files

Epstein Files

మొత్తానికి లైంగిక నేరస్థుడు, ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంంధించిన ఫైల్స్ విడుదలయ్యాయి. దర్యాప్తుకు సంబంధించిన వేల పేజీల పత్రాలను అమెరికా న్యాయ శాఖ విడుదల చేసింది. ఎప్‌‌స్టీన్ దర్యాప్తునకు సంబంధించిన రికార్డులను విడుదల చేయాలని ఇటీవలే ట్రంప్ ఆదేశిస్తూ ఫైల్‌పై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదలైంది. లక్షలాది పత్రాలు ఉన్నాయని.. ప్రస్తుతం కొద్దిగా విడుదల చేస్తు్న్నామని.. రాబోయే వారాల్లో మరిన్ని విషయాలు వస్తాయని డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే వెల్లడించారు.

ఇక తాజాగా విడుదలైన ఫొటోల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్ కనిపించారు. బిల్ క్లింటన్.. గుర్తుతెలియని మహిళతో జలకాలాటలు ఆడుతున్నట్లు కనిపించింది. బిల్ క్లింటన్ జాకుజీలో గుర్తుతెలియని మహిళతో పడుకుని ఉన్న ఫొటో ఎప్పుడూ.. ఎక్కడ తీశారో మాత్రం పత్రాల్లో పేర్కొనలేదు. ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్నట్లుగా వెల్లడించలేదు. తాజాగా విడుదలైన చిత్రాల్లో ఎక్కువగా బిల్ క్లింటన్ ఉన్నారు. ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్‌నకు సంబంధించిన చిత్రాలు మాత్రం కనిపించలేదు.

ఇక దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ కూడా అనేక చిత్రాల్లో కనిపించారు. అలాగే రోలింగ్ స్టోన్స్ ఫ్రంట్‌మ్యాన్ మిక్ జాగర్ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులతో ఎప్‌స్టీన్ కనిపించారు. ఒక చిత్రంలో ట్రంప్ సంతకం చేసిన ఒక చెక్ కనిపించింది. ఎప్‌స్టీన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా తీసిన ఆల్బమ్ చిత్రాల్లో ఇది కనిపించింది. ఈ చిత్రంపై వైట్‌హౌస్ స్పందించలేదు. ఇక అనేక పత్రాల్లో నగ్నంగా.. తక్కువ దుస్తులు ధరించిన చిత్రాలు కనిపించాయి. అలాగే ఎప్‌స్టీన్ గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో పోజులిచ్చిన అస్పష్టంగా ఉన్న ముఖాలు కనిపించాయి.

ఇక తాజాగా విడుదలైన బిల్ క్లింటన్ ఫొటోలపై వైట్‌హౌస్ బహిరంగంగా స్పందించింది. బిల్ క్లింటన్ ప్రపంచంలో ఏ చింతా లేకుండా ప్రశాంతంగా ఉన్నారంటూ వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

ఇక వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కూడా బిల్ క్లింటన్ ఉన్న ఫొటోలను ఎక్స్‌లో రీపోస్ట్ చేస్తూ ‘‘అయ్యో!!’’ అంటూ వ్యాఖ్యానించింది.

లైంగిక అక్రమ రవాణా ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న సమయంలో ఎప్‌స్టీన్ ఆగస్టు 2019లో మాన్‌హట్టన్‌లోని ఒక ఫెడరల్ జైలులో చనిపోయి కనిపించాడు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా అధికారులు నిర్ధారించారు.

Exit mobile version