NTV Telugu Site icon

India vs Pakistan: జైషే మహమ్మద్‌ను ముందు మీ దేశంలో అంతం చేయండి.. షాకైన బిలావల్ భుట్టో..

Pak

Pak

India vs Pakistan: ఆపరేషన్ సింధూర్ కి భంగపడ్డ పాకిస్తాన్ భారత్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టుకునేందుకు అమెరికాలో పర్యటిస్తున్న బిలావల్‌ భుట్టో నేతృత్వంలోని పాక్ అఖిలపక్ష బృందానికి అనూహ్య పరిణామం ఎదురైంది. మొదట మీ దేశంలో ఉన్న జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థను అంతం చేయండి, ఆ తర్వాతే మద్దతు కోసం ప్రయత్నాలు చేయండని అమెరికా చట్టసభ సభ్యుడు బ్రాడ్‌ షెర్మన్‌ వారికి సూచించారు.

Read Also: Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ రాజకీయ నేపథ్యం.. పూర్తి వివరాలు ఇవే

అలాగే, ప్రపంచంలోనే కరుడుగట్టిన అల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ను పట్టించడంలో సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) కి సహాయం చేసిన పాకిస్తాన్‌ డాక్టర్‌ షకీల్‌ అఫ్రీదీని తక్షణమే రిలీజ్ చేయాలని అమెరికా చట్టసభ సభ్యుడు బ్రాడ్‌ షెర్మన్‌ డిమాండ్‌ చేశారు. ఈ హఠాత్పరిణామంతో పాకిస్తాన్ అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహిస్తున్న బిలావల్‌ భుట్టోకు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.. ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డాడు. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను షెర్మన్‌ తన ఎక్స్‌ (ట్విట్టర్)లో పంచుకున్నారు.