Site icon NTV Telugu

Emirates Airlines : ప్రయాణికులకు రిలీఫ్..! మళ్లీ ప్రారంభమైన దుబాయ్ విమానాలు

Emirates

Emirates

Emirates Flights Resume : దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Dubai International Airport) కు సంబంధించిన విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తాజాగా వాటిని మళ్లీ ప్రారంభించినట్లు ప్రకటించింది. భద్రతా కారణాల వల్ల కొంతసేపు విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపిన సంస్థ, పరిస్థితులు సమీక్షించిన తరువాత తిరిగి ఆపరేషన్లు ప్రారంభించినట్లు వెల్లడించింది.

శనివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఎమిరేట్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో మధ్యాహ్నం తర్వాత షెడ్యూల్ ఉన్న విమానాలకు టికెట్ బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు రావచ్చని తెలిపింది. ఇక దుబాయ్ ద్వారా ఇతర దేశాలకు ట్రాన్సిట్ ప్రయాణం చేసే వారికి కూడా ఈ సూచన వర్తిస్తుందని ఎమిరేట్స్ వెల్లడించింది. అయితే వారి కనెక్టింగ్ ఫ్లైట్ సాధారణంగా నడుస్తున్నట్లయితేనే ఎయిర్‌పోర్ట్‌కు రావాలని సూచించింది.

Spectre I: మైక్రోఫోన్‌లను గుర్తించి ఆడియోను తక్షణమే బ్లాక్ చేసే డెవిలెన్స్ స్పెక్టర్ I.. ప్రైవసీకి ఢోకా లేదు!

ఇదే సమయంలో ఉదయం 11:08 గంటలకు (దుబాయ్ సమయం) చేసిన ఒక పాత ప్రకటన ప్రస్తుతం అమల్లో లేదని సంస్థ స్పష్టం చేసింది. ఆ ప్రకటన వల్ల ప్రయాణికుల్లో గందరగోళం ఏర్పడకుండా ఉండేందుకు దాన్ని తొలగించినట్లు పేర్కొంది. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ముందు తమ విమానం స్థితి (Flight Status), సీట్ల లభ్యతను ఎమిరేట్స్ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సంస్థ సూచించింది.

IND vs NZ Final: గంభీర్ కాస్త జాగ్రత్త! అహ్మదాబాద్ పిచ్‌పై టీమిండియాను ముంచే ‘ముల్లు’ ఇతనే!

పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైతే ఆపరేషన్ల షెడ్యూల్‌లో మార్పులు చేస్తామని ఎమిరేట్స్ తెలిపింది. ప్రయాణికుల భద్రత, సిబ్బంది రక్షణ తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది. అయితే, ఇదే రోజున ఉదయం భద్రతా కారణాల వల్ల దుబాయ్‌కు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎమిరేట్స్ ముందుగా ప్రకటించింది. ఆ సమయంలో ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు రావద్దని కూడా సూచించింది. తాజాగా పరిస్థితులు సర్దుబాటు కావడంతో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయని సంస్థ తెలిపింది.

Exit mobile version