ప్రంపచ కుభేరుడు, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియా ఫిదా అయిపోయింది.. తన ట్విటర్ ఫాలోవర్, భారతదేశానికి చెందిన తన చిరకాల మిత్రుడిని సర్‌ప్రైజ్ చేశారు మస్క్.. టీసీఎస్‌లో పనిచేస్తున్నసాఫ్ట్‌వేర్ డెవలపర్ ప్రణయ్ పాథోల్‌ను ఆత్మీయంగా కలుసుకున్నారు… అయితే ఈ విషయాన్ని పాథోల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారిపోయింది.. ఫొటోను మాత్రమే షేర్ చేయడం కాదు.. పాథోల్ ఆ ఫొటోకు ఒక శీర్షికను జోడించాడు.. అక్కడ అతను తనను కలవడం గురించి ఎలా భావించాడో పేర్కొన్నాడు.. బిలియనీర్ వ్యాపారవేత్త ఎంత ‘వినయం’ మరియు ‘డౌన్ టు ఎర్త్’ అని వెల్లడించాడు.
Read Also: India vs Zimbabwe: భారత్ క్లీన్ స్వీప్.. ముచ్చెమటలు పట్టించిన సికందర్
“గిగాఫాక్టరీ టెక్సాస్‌లో మస్క్‌ను కలవడం చాలా గొప్పగా అనిపించింది. ఇంత నిరాడంబరమైన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. లక్షలాది మందికి మీరు స్ఫూర్తి” అంటూ ట్వీట్ చేశారు పాథోల్.. ఫోటోలో ఎలాన్ మస్క్ మరియు ప్రణయ్ పాథోల్ పక్కపక్కనే నిలబడి ఉన్నారు. అయితే, కొన్ని గంటల్లోనే ఆ ట్వీట్ 12,000 కంటే ఎక్కువ లైక్‌లను సంపాదించింది మరియు 400కి పైగా రీట్వీట్‌లు వచ్చాయి.. ఆ ఫోటోను రీట్వీట్ చేస్తూ.. రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు నెటిజన్లు.. ఇక, లక్షలాది మందికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని కలిసినందుకు పలువురు పాథోల్‌ను అభినందించారు.
అయితే, పాథోల్‌ను అభినందిస్తూ.. ఒక కల నిజమైంది పాథోల్.. మీరు చాలా కాలంగా అభిమానించే వారిని కలుసుకున్న అనుభూతి భగవంతుడిని చూడటం కంటే తక్కువ కాదు. అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ నెటిజన్ రిట్వీట్ చేశాడు.. మరొకరు “వావ్, అది ఆశ్చర్యంగా ఉంది, ప్రణయ్. చాలా అద్భుతంగా ఉంది. అభినందనలు! అద్భుతమైన ఫోటో. మీరు నిజంగా సంతోషంగా ఉన్నారు మరియు ఎలాన్ కూడా దానిని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. నేను కొంచెం అసూయపడుతున్నాను, నేను ఒప్పుకోక తప్పదు. మీకు సమయం ఉందా. కొంచెం మాట్లాడాలా? దాని గురించి మాకు చెప్పండి.” “టెక్సాస్‌కు స్వాగతం” అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు.. కాగా, 2018లో రెండవ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థి అయిన పాథోల్.. టెస్లా యొక్క ఆటోమేటిక్ విండ్‌స్క్రీన్ వైపర్‌లతో సమస్యను లేవనెత్తినప్పుడు.. వెంటనే రిప్లే ఇచ్చారు మస్క్.. అలా ఇద్దరూ మొదటిసారిగా సంభాషించారు. పాథోల్ సూచించిన సమస్యను.. తర్వాత వచ్చిన మోడల్‌లో పరిష్కరించినట్టు మస్క్ రాశారు. అప్పటి నుండి, మస్క్ మరియు పాథోల్ పోస్ట్‌లు మరియు డైరెక్ట్ మెసేజ్‌ల ద్వారా అనేక సందర్భాల్లో పరస్పరం సంభాషించుకున్నారు.. ఇప్పుడు ఇలా కలిశారు.
https://twitter.com/PPathole/status/1561591196178419712
