Site icon NTV Telugu

Elon Musk’s Mother Sleeps in Garage: సొంత గూడు లేని ఎలాన్‌ మస్క్‌..! గ్యారేజీలో నిద్రిపోయిన ఆయన తల్లి..

Elon Musk

Elon Musk

ఎలాన్‌ మస్క్‌.. దాదాపు ఈ పేరు తెలియనివారు ఉండరు.. టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల సీఈవో అయిన ఆయన.. ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ కుబేరుడు… కానీ, ఆయనకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు.. మస్క్‌ ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టారు.. బిజినెస్‌ పనిపేద వెళ్లినప్పుడు తాను తన మిత్రుల ఇంట్లోనే బస చేస్తానని కూడా తెలిపారు.. అయితే, తాజాగా యన తల్లి 74 ఏళ్ల మే మస్క్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. ఇటీవల ఒక గ్యారేజీలో నిద్రించాల్సి వచ్చింది ‘ద సండే టైమ్స్‌’ పత్రికతో తెలిపారు మే మస్క్‌.. తన కుమారుడు ఎలాన్‌ మస్క్‌ను కలిసేందుకు స్పేస్‌ ఎక్స్‌ ప్రధాన కార్యాలయం ఉన్నటెక్సాస్‌కు వెళ్లాలని, అక్కడికి సమీపంలోని ఇల్లేమీ లేదని, అందుకే ఒక గ్యారేజీలో నిద్రించానని వెల్లడించారు.. ఇక, తనకు అంగారక గ్రహంపైకి వెళ్లాలన్న కోరిక లేదని పేర్కొన్నారు మే మస్క్‌.

Read Also: Vizag Sai Priya Case: విశాఖ సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్‌..

అంతేకాదు, తన కుమారుడు భౌతిక ఆస్తులపై ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు మే మస్క్‌. కాగా, తనకు “ప్రస్తుతం ఇల్లు కూడా లేదు” మరియు “స్నేహితుల ఇల్లలోనే ఉంటున్నట్టు ఏప్రిల్‌లోనే వెల్లడించారు ఎలాన్‌ మస్క్.. ఆ తర్వాత తాను ప్రస్తుతానికి స్పేస్‌ఎక్స్ నుండి ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు, దాని విలువ 50,000 యూఎస్‌ డాలర్లు అంటూ ట్వీట్ చేశాడు.. ఇక, మస్క్‌ గత వేసవిలో తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను అన్‌లోడ్ చేయడం ప్రారంభించాడు, అతను తన జీవితాన్ని “మార్స్ మరియు ఎర్త్‌కు” అంకితం చేయడానికి అన్ని స్పష్టమైన ఆస్తులను వదులుకుంటానని వెల్లడించాడు. నేను దాదాపు అన్ని భౌతిక ఆస్తులను విక్రయిస్తున్నాను. సొంత ఇల్లు ఉండదు అని మే 2020లో ట్వీట్ చేశాడు. నగదు అవసరం లేదు, అంటూ 2020లో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే..

Exit mobile version