టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ట్విట్టర్ డీల్ చివరి దశకు చేరుకుంది… శుక్రవారం నాటికి ట్విట్టర్ కొనుగోలును పూర్తి చేస్తానంటూ ఎలాన్ మస్క్ బ్యాంకులకు సమాచారం ఇచ్చారు. దీనికి మద్దతుగా మస్క్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఇందుకు సంబంధించి వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌చేశారు మస్క్.. అయితే, మస్క్ ఎంట్రీ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.. ఆ వీడియోలో ఆయన ట్విట్టర్ కార్యాలయంలోకి ఓ సింక్‌ను మోసుకెళ్తున్నారు.. ఇది ఆయన సెంటిమెంట్ కావొచ్చు అంటున్నారు.. ఇక, ఎలాన్ మస్క్ తన 44 బిలియన్ల డాలర్ల ట్విట్టర్ కొనుగోలు ఒప్పందానికి శుభంకార్డు వేసేముందు.. తన బయోని “చీఫ్ ట్విట్”గా మార్చుకున్నాడు.
Read Also: Vishnu Vardhan Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ డ్రామా..! ఇది పీకే కుట్ర..
శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో ఎలాన్ మస్క్.. సింక్‌ను మోసుకెళ్తూ ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చారు.. “ట్విటర్ హెచ్‌క్యూలోకి ప్రవేశిస్తున్నాను.. లెట్ దట్ సింక్ ఇన్!” అనే క్యాప్షన్‌తో ఆ సందర్భానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు మస్క్.. ఇక, వీడియోలో, ఎలాన్ మస్క్.. సింక్‌ను మోస్తూ, తాను మునిగిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పడం కనిపిస్తుంది. కాగా, ఏప్రిల్‌లో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ను కొనుగోలు చేయాలనే తన నిర్ణయాన్ని బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటించినప్పటి నుండి… ఈ డీల్ ముగింపు దశకు చేరుకునే వరకు ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. అయితే జూలైలో ఎలాన్ మస్క్ … స్పామ్ మరియు నకిలీ బాట్ ఖాతాల సంఖ్యను తప్పుగా సూచించడం ద్వారా ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించడం.. డీల్ నుంచి ఆయన వెనక్కి తగ్గడం.. మాస్క్‌పై ట్విట్టర్ దావా.. మళ్లీ మస్క్ మనసు మారడం.. ఇలా ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్న విషయం విదితమే. మొత్తంగా.. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను మస్క్ సొంతం చేసుకుంటున్నారు. ఆ సంస్థలో కీలక మార్పులు కూడా జరగనున్నాయనే ప్రచారం సాగుతోంది. అయితే సింక్‌తో ఆఫీసులోకి ఎలాన్ మస్క్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. నెటిజన్లు కామెంట్లు పెడుతూ దీనిపై స్పందిస్తున్నారు.. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సెంటిమెంట్లు ఉంటాయి.. మన మస్క్ కు సింక్ సెంటిమెంట్ ఉందేమో? అని కామెంట్లు పెడుతున్నారు.
Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7
— Elon Musk (@elonmusk) October 26, 2022