Site icon NTV Telugu

Elon Musk most creative person: ఎలాన్ మ‌స్క్‌పై నెట్‌ఫ్లిక్స్ సీఈవో ప్రశంసలు.. నేల‌పై క్రియేటివ్‌గా ఆలోచించే ఏకైక వ్యక్తి..!

Elon Musk

Elon Musk

ఏది జరిగినా విమర్శించేవారే కాదు.. మద్దతు ఇచ్చేవారు కూడా ఉంటారు.. ఈ మధ్య ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న టెస్లా చీఫ్‌, ప్రపంచ కుభేరుడు ఎలాన్‌ మస్క్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు.. ఇది చాలా మందికి రుచించడం లేదు.. ఉద్యోగులపై వేటు ఓవైపైతే.. మరోవైపు బ్లూటిక్‌కు డబ్బులు వసూలు చేయడం పనిగా పెట్టుకున్నాడు.. దీంతో, చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.. ఇదే సమయంలో.. ఆయనపై ప్రశంసలు కురిపించేవారు కూడా ఉన్నారు.. తాజాగా నెట్‌ఫ్లిక్స్ సీఈవో రీడ్ హేస్టింగ్స్ ఈ జాబితాలో చేరాడని చెప్పాలి.. ఎందుకంటే.. న్యూయార్క్ టైమ్స్ డీల్‌బుక్ స‌ద‌స్సుకు హాజ‌రైన హేస్టింగ్స్.. ఎలాన్‌ మ‌స్క్‌ ధైర్యవంతుడు.. అంతేకాదు.. ఈ నేల‌పై క్రియేటివ్‌గా ఆలోచించే వ్యక్తి అత‌నొక్కడే.. అంటే కితాబిచ్చారు..

Read Also: Touch The Farmer Feets: కమ్మ సామాజిక వర్గంలో మార్పు..! నాయుడుకి డిప్యూటీ సీఎం పాదాభివందనం

ఇక, మస్క్ వివిధ రంగాల్లో సాధించిన అద్భుతాలే అందుకు నిద‌ర్శనం.. అత‌ను వంద శాతం ఆత్మవిశ్వాసంతో ఉంటారని.. త‌న విజ‌యాల‌తో ప్రపంచానికి సాయ‌పడాలనేది ఆయన కోరిక అంటూ మ‌స్క్‌పై ప్రశంసల వర్షం కురిపించారు రీడ్ హేస్టింగ్స్.. అంతటితో ఆగకుండా.. ఒక సంస్థను నడిపే వ్యక్తిగా.. త‌న‌కు, మ‌స్క్‌కు ఉన్న తేడాను కూడా చెప్పుకొచ్చారాయన.. నేను నిదానంగా, గౌర‌వ‌ప్రద‌మైన నాయ‌కుడిగా ఉండాలని చూస్తాను.. కానీ, మ‌స్క్ అవేం ప‌ట్టించుకోడు.. త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా ఉంటారు.. నేను ఆయనలా పనిచేయలేను బాబోయ్ అన్నారు.. ఇక, మస్క్‌ అంటే నాకు చాలా గౌర‌వం అని పేర్కొన్న ఆయన.. ట్విట్టర్‌లో మార్పులు చేస్తున్నాడని అతడిని విమర్శించడం సరికాదని హితవుపలికారు..

మస్క్ “ఈ భూమి మీద ఉన్న ధైర్యవంతుడు, అత్యంత సృజనాత్మక కలిగిన వ్యక్తి” అని పేర్కొనగా.. దానికి మస్క్ స్పందిస్తూ, “వావ్, మంచి మాటలకు ధన్యవాదాలు.” అంటూ ట్వీట్‌ చేశారు.. అతను చేసిన ట్వీట్ చూస్తే, హేస్టింగ్స్ వ్యాఖ్యను మాస్క్‌ హృదయపూర్వకంగా తీసుకున్నట్లు అనిపిస్తోంది.. “ప్రజాస్వామ్యం మరియు సమాజం కోసం [ట్విట్టర్] మరింత మెరుగ్గా ఉండటానికి, మరింత బహిరంగ వేదికను కలిగి ఉండటానికి అతను ఈ డబ్బు మొత్తాన్ని వెచ్చించాడు.. నేను ఆ ఎజెండా పట్ల సానుభూతితో ఉన్నాను” అని హేస్టింగ్స్ చెప్పారు. ట్విట్టర్‌ని కొనుగోలు చేసినప్పటి నుండి మస్క్ తన మార్పులతో సంచలనం సృష్టించాడు. అతను వినియోగదారులు బ్లూ చెక్‌మార్క్‌లను పొందడానికి $8 సబ్‌స్క్రిప్షన్ ఫీజును అమలు చేయడం ప్రారంభించాడు, ఇవి గతంలో సాధారణంగా పబ్లిక్ ఫిగర్‌లు లేదా సంస్థల ఖాతాలకు మాత్రమే ఉండేది. అయితే, వెరిఫికేషన్‌పై ధర పెట్టడం, నెలవారీ ఛార్జీని చెల్లించేంత వరకు ఎవరైనా చెక్‌ను కలిగి ఉండటానికి అనుమతించడం తప్పుడు సమాచారం వ్యాప్తికి దారితీస్తుందనే విమర్శలు లేకపోలేదు..

Exit mobile version