Site icon NTV Telugu

Elon Musk: మస్క్ సంచలన నిర్ణయం.. ‘ఎక్స్’ విక్రయం

Musk

Musk

ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’ను తన సొంత xAI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీకి 33 బిలియన్ డాలర్లకు ఆల్ స్టాక్ డీల్‌లో విక్రయించినట్లు మస్క్  ప్రకటించారు. ఎక్స్‌ఏఐ విలువను 80 బిలియన్‌ డాలర్లుగా నిర్ధారించారు. ఎక్స్‌ఏఐ అధునాత ఏఐ సామర్థ్యాన్ని, ఎక్స్‌కు అనుసంధానించడం ద్వారా ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చని మస్క్‌ తన పోస్టులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కీలక ములుపు..

ఎలోన్ మస్క్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవోగా కూడా ఉన్నారు. 2022లో ‘ట్విట్టర్’ను మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. అనంతరం సిబ్బందిని తొలగించి అనంతరం ‘ఎక్స్‌’గా మార్చారు. ఈ సందర్భంగా ద్వేషపూరిత ప్రసంగం పెద్ద సంచలనం అయింది. ఇక ఒక ఏడాది తర్వాత ఎక్స్‌ఏఐను ప్రారంభించారు. భవిష్యత్ ప్రణాళికలో భాగంగా ‘ఎక్స్’, ‘ఎక్స్‌ఏఐ’ను కలిపినట్లుగా మస్క్ పేర్కొన్నారు. మరింత ప్రతిభ సాధించడానికే ఈ విధంగా చేసినట్లుగా పేర్కొ్న్నారు.

ఇది కూడా చదవండి: Irfan Pathan: “నేను దీన్ని సమర్థించను”.. ధోని బ్యాటింగ్ ఆర్డర్‌పై ఇర్ఫాన్ పఠాన్ రియాక్షన్..

Exit mobile version