Elon Musk: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
- భారతదేశంలో జననాల రేటు క్రమంగా తగ్గుతుండటంపై Elon Musk ఆందోళన
- గత దశాబ్దంలో 2.3 నుంచి 1.9కి తగ్గింది
- సంతానోత్పత్తి రేటు సుమారు 2.1 ఉండాలి. దీనినే పునఃస్థాపన స్థాయి అంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచిన భారతదేశంలో జననాల రేటు క్రమంగా తగ్గుతుండటంపై Elon Musk ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ సంతానోత్పత్తి రేటు (Total Fertility Rate – TFR) జనాభా స్థిరంగా కొనసాగేందుకు అవసరమైన పునఃస్థాపన స్థాయి (Replacement Level) కంటే దిగువకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో స్పందించిన మస్క్, “భారతదేశ జననాల రేటు పునఃస్థాపన స్థాయి కంటే దిగువకు పడిపోయింది. ముఖ్యంగా ఎక్కువ చదువుకున్న వర్గాల్లో ఈ పరిస్థితి చాలా సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది” అని వ్యాఖ్యానించారు.
మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు, భారతదేశ జననాల రేటుపై వెలువడిన తాజా గణాంకాల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నివేదికల ప్రకారం, దేశ మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) గత దశాబ్దంలో 2.3 నుంచి 1.9కి తగ్గింది. సాధారణంగా ఒక దేశ జనాభా స్థిరంగా కొనసాగాలంటే సంతానోత్పత్తి రేటు సుమారు 2.1 ఉండాలి. దీనినే పునఃస్థాపన స్థాయి అంటారు.
Also Read
- Pakistan BLA: పాక్ సైన్యంలో కెప్టెన్.. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అధిపతి!
- US-Iran Tensions: అమెరికా మరోసారి తప్పు చేస్తే.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
- Benjamin Netanyahu: మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ సైరన్! ఇరాన్ అంతానికి నెతన్యాహు డెడ్లీ వార్నింగ్
- Donald Trump: ట్రంప్‌కు కోర్టులో మరో షాక్.. వైట్‌హౌస్ సమీపంలోని గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపై బ్రేక్!
రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంది. అక్కడ సంతానోత్పత్తి రేటు 1.2కు పడిపోయినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా తక్కువ స్థాయిలో ఉండటం విశేషం. ఈ అంశంపై ఇటీవల The Economist ప్రచురించిన కథనంలో, “భారతదేశ జనాభా త్వరలో తగ్గడం ప్రారంభమవుతుంది” అని పేర్కొంది. ప్రస్తుతం దేశ జనాభా పెరుగుతున్నప్పటికీ, తక్కువ జననాల రేటు ప్రభావం రానున్న దశాబ్దాల్లో స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పట్టణీకరణ, మహిళల విద్యా స్థాయి పెరగడం, ఉపాధి అవకాశాల విస్తరణ, వివాహాలు ఆలస్యంగా జరగడం, కుటుంబ నియంత్రణపై అవగాహన పెరగడం వంటి కారణాల వల్ల జననాల రేటు తగ్గుతోంది. జననాల రేటు తగ్గడం తక్షణ సమస్య కాకపోయినా, దీర్ఘకాలంలో వృద్ధ జనాభా పెరగడం, శ్రామిక శక్తి తగ్గడం, ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని జనాభా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Tags
- Elon Musk
- india
- population
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!